Rashmika & Ranbir : యానిమల్ కోసం హిమాచల్ వెళ్లిన రణ్ భీర్, రష్మిక….!

Rashmika & Ranbir : ఆలియా, రణ్ భీర్ లా పెళ్లి ఏప్రిల్ 14 నా చాలా సింపుల్ గా కేవలం అత్యంత సన్నిహితులైన బంధువులు, స్నేహితుల మధ్య జరిగింది. ఇక పెళ్లి జరిగి వారమైన కాకముందే రణ్ భీర్ అపుడే సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న యానిమల్ సినిమాలో హీరోగా రణ్ భీర్ నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నేషనల్ క్రష్ గా పేరు పొందిన రష్మిక మందన నటిస్తోంది.

ఇక ఈ సినిమా షూటింగ్ ను హిమాచల్ ప్రదేశ్ లో మొదలుపెట్టారు చిత్రం యూనిట్. మనాలి వెళ్లిన చిత్ర యూనిట్ కు అక్కడి చిత్ర యంత్రాంగం సాంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు.. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాన్ని టి సిరీస్‌, భద్రకాళి పిక్చర్స్‌పై ప్రముఖ హిందీ నిర్మాత భూషణ్‌ కుమార్‌, ప్రణవ్‌ రెడ్డి వంగా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమాను హిందీతో పాటు దక్షిణాది భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని 2023 ఆగస్టు 23న విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో రష్మిక కు ముందుగా పరణీతి చోప్రా ను హీరోయిన్ గా అనుకున్నారట కానీ ఇంతియాజ్ అలీ తో కలిసి పనిచేయడం ఇష్టం లేని పరణీతి సినిమాను వదులుకుందట.ఇక రణ్ భీర్ నటిస్తున్న బ్రహ్మస్త్ర సినిమాకు సంబంధించిన పాటను ఇటీవలే విడుదల చేసారు. ఈ పాటకు ప్రేక్షకులనుండి మంచి స్పందన లభిస్తోంది. బ్రహ్మస్త్ర సినిమాలో రణ్ భీర్ సరసన ఆలియా నటిస్తోంది.