Rajamouli: రణబీర్ కపూర్ చేసిన పనికి రాజమౌళి ఫిదా

Ranbir bowed at Jakkanna's feet

Rajamouli:బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, దర్శకుడు అయాన్ ముఖర్జీ కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీగా వస్తున్న “బ్రహ్మాస్త్ర” తెలుగు వెర్షన్ మోషన్ పోస్టర్ రిలీజ్ కార్యక్రమం శనివారం హైదరాబాద్ లో జరిగింది. ఈ ఫంక్షన్ కి హీరో, డైరెక్టర్, హీరోయిన్ ఆలియాభట్, ప్రొడ్యూసర్ కరణ్ జోహార్, గెస్ట్ పాత్రలో నటిస్తున్న అక్కినేని నాగార్జున వచ్చారు. ఇక ముఖ్య అతిధిగా విచ్చేసిన టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి ఈ మూవీకి దక్షిణాదిన సమర్పకునిగా కూడా వ్యవరిస్తుండటం విశేషం.

ఈ సందర్బంగా జక్కన్న మాట్లాడుతూ… రణబీర్ కపూర్ ను తనకిష్టమైన బాలీవుడ్ హీరో అని, కళ్ళతో కూడా గొప్పగా నటిస్తాడని పొగడ్తలతో ముంచేశాడు. ఈ క్రమంలో స్టేజి మీదకి వెళ్లిన రణబీర్, జక్కన్న కాళ్లకు నమస్కరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణంగా నార్త్ లో ఇలాంటి సంప్రదాయాలు ఎప్పుడూ కనిపించవు. హగ్స్, కిస్సస్, హైఫైలు మాత్రమే కనిపిస్తాయి. అలాంటిది బాలీవుడ్ స్టార్ హీరో మన తెలుగు డైరెక్టర్ కి ఇలాంటి గౌరవం ఇవ్వటం చూసిన వారంతా షాక్ అవుతున్నారు.

https://www.youtube.com/watch?v=N2FI2GUAtI0

కరణ్ జోహార్ తో తన సినిమాలను నార్త్ లో పబ్లిసిటీ చేయించుకునే జక్కన్నకు ఇప్పుడు తనవంతు వచ్చింది. బ్రహ్మాస్త్ర మూవీకి సౌత్ లో ప్రచారం చేస్తున్నాడు. దీంతో ఈ మూవీకి దక్షిణాది భాషలన్నింటిలోనూ హైప్ రావటం ఖాయం. మొత్తం మూడు పార్ట్ లు గా రాబోతున్న ఈ ప్రాజెక్ట్ నుండి తొలిగా ‘బ్రహ్మాస్త్ర పార్ట్-1 శివ’ వచ్చే ఏడాది సెప్టెంబర్ 9 న రిలీజ్ అవుతుంది. అమితాబ్ బచ్చన్, డింపుల్ కపాడియా, మౌని రాయ్ ప్రముఖ పాత్రలలో నటిస్తున్నారు.