లేటెస్ట్ గా ఓటిటి లో వచ్చి సంచలనంగా మారిన వెబ్ సిరీస్ ఏదన్నా ఉంది అంటే ఆ సిరీస్ విక్టరీ వెంకటేష్ మరియు దగ్గుబాటి రానా కలిసి నటించిన ఇంట్రెస్టింగ్ రివెంజ్ డ్రామా “రానా నాయుడు” అని చెప్పి తీరాలి. అసలు వెంకటేష్ ని రానా ని ఈ రేంజ్ లో చూస్తామని తన ఫ్యాన్స్ గాని జెనరల్ ఆడియెన్స్ కూడా ఊహించి ఉండరు.
ఆ లెవెల్లో ఈ సిరీస్ లో అయితే ఇద్దరూ చితక్కొట్టేసారు. అయితే ఈ సిరీస్ కోసం పెద్దగా తెలియని వారు అయితే ఈ సిరీస్ సడెన్ గా చూసి అయితే షాక్ అవుతున్నారు. మరి ఆ రేంజ్ లో ఈ సిరీస్ లోకి 18+ కంటెంట్ గాని డైలాగ్స్ గాని ఉన్నాయి. పైగా ఈ అశ్లీల సన్నివేశాలు డైలాగ్స్ కూడా రానా వెంకీ మామ లు చేయడం కూడా ఇంకో ఎత్తు దీనితో ఇప్పుడు సెన్సేషన్ గా మారిన ఈ సిరీస్ కోసమే చర్చ నడుస్తుంది.
ముఖ్యంగా ఆ సన్నివేశాల కోసం అంతా మాట్లాడుకుంటూ ఉండగా మరోసారి అయితే రానా వార్న్ చేస్తున్నాడు. స్ట్రిక్ట్ గా ఈ సిరీస్ ని ఒంటరిగా మాత్రమే చూడాలి అని 18+ కంటెంట్ అడల్ట్ సర్టిఫైడ్ అంటూ తెలిపాడు. అయితే ఆల్రెడీ ఇది వరకే రానా సహా వెంకీ మామ కూడా ఇది ఫామిలీ తో కలిసి చూసేది కాదు అని చెప్తూనే ఉన్నారు.
కాగా అది తెలియని వారు ఇప్పుడు అనవసర కామెంట్స్ చేస్తున్నారు. దీనితో అలాంటి వారికి రానా మరోసారి క్లారిటీ ఇచ్చాడు. కాగా ఈ సాలిడ్ సిరీస్ అయితే ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో తెలుగు హిందీ, ఇంగ్లీష్, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ లో ఉంది.
Strictly watch alone – 18+ content – A https://t.co/4sjLizjgsh
— Rana Daggubati (@RanaDaggubati) March 12, 2023