చైతన్య థాంక్యూ టీజర్ పై స్పందించిన రానా.. కరెక్ట్ గా సరిపోయావంటూ కామెంట్స్!

నాగ చైతన్య, రాశి ఖన్నా, మాళవికా నాయర్ ప్రధాన పాత్రలలో విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం థాంక్యూ.ఈ సినిమా షూటింగ్ పనులన్నింటినీ పూర్తి చేసుకొని జూలై 8 వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా చిత్రబృందం ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ విడుదల చేస్తూ సినిమాపై అంచనాలను పెంచారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ టీజర్ లో నాగ చైతన్య చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

లైఫ్ లో ఎన్నో వదులుకొని ఇక్కడి వరకు వచ్చానని,లైఫ్లో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు నన్ను నేను సరి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అంటూ నాగ చైతన్య చెప్పిన డైలాగ్స్ కు ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకోవడమే కాకుండా ఈ డైలాగ్స్ నాగచైతన్య నిజ జీవితానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు.ఇక నాగచైతన్య చెప్పిన ఈ డైలాగ్స్ నెటిజన్లు మాత్రమే కాకుండా సినీ ప్రముఖులు కూడా స్పందిస్తూ వారి అభిప్రాయాలను తెలియ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే నాగచైతన్యకు వరుసకు బావ అయ్యే రానా ఈ డైలాగ్ పై స్పందిస్తూ చైతన్యకు కామెంట్ చేశారు. నువ్వు ఆల్రెడీ సరి అయిపోయావు బ్రదర్, సూపర్ టీజర్ గాయ్ అంటూ చెప్పుకొచ్చారు. అదేవిధంగా థాంక్యూ చిత్ర బృందానికి రానా బెస్ట్ విషెస్ తెలియజేశారు. ఈ క్రమంలోనే రానా చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక రానా ట్వీట్ పై స్పందించిన రాశిఖన్నా థాంక్యూ అంటూ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.