ఆ సంస్థతో లింకులు.. డ్రగ్స్ కేసుతో రానాలో గుబులు!

Rana Daggubati Links With KWAN Talent Management

బాలీవుడ్ డ్రగ్స్ కేసు టాలీవుడ్ పునాదులు కదిల్చేలా ఉంది. ప్రస్తుతం డ్రగ్స్ వ్యవహారం మొత్తం క్వాన్ అనే టాలెంట్ ఏజెన్సీ సంస్థ చుట్టూ తిరుగుతోంది. ఈ సంస్థలోని ఉద్యోగితోనే డ్రగ్స్ వ్యవహారం మలుపుతిరిగింది. నిన్న మీడియాలో అంతా డీ అండ్ కే వాట్సప్ చాట్ రచ్చ రచ్చగా మారింది. డీ అంటే దీపికా పదుకొణె అని కే అంటే కరిష్మా (క్వాన్ టాలెంట్ ఏజెన్సీ మేనేజర్) అని డీ కోడ్ చేశారు. ఇక అక్కడి నుంచి కేసులో కొత్త కొత్త పేర్లు బయటకు వస్తున్నాయి.

Rana Daggubati Links With KWAN Talent Management
Rana Daggubati Links With KWAN Talent Management

ఇప్పటికే కరిష్మాకు సమన్లు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇక త్వరలోనే కరిష్మా ఎన్‌సీబీ(నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో) అధికారుల ఎదుట హాజరు కాబోతోంది. డీ అండ్ కే ఛాటింగ్ జే జయ సాహా, ఎన్ నమ్రతా శిరోద్కర్, ఎస్ శ్రద్దా కపూర్ అని మరికొన్ని పేర్లు లీకయ్యాయి. ఇందులో మహేష్ బాబు సతీమణి నమత్ర పేరు రావడంతో టాలీవుడ్ పునాదులు కదిలినట్టైంది. ఇక తాజాగా రానా కూడా భయపడుతున్నాడని తెలుస్తోంది.

Rana Daggubati Links With KWAN Talent Management
Rana Daggubati Links With KWAN Talent Management

క్వాన్ టాలెంట్ ఏజెన్సీతో రానాకు దగ్గరి సంబంధాలున్నాయని తెలుస్తోంది. సౌత్‌కు సంబంధించిన వ్యవహారాలు రానా చూసుకుంటాడని తెలుస్తోంది. ఈ మేరకు రానాకు కూడా ఈ వ్యవహారం చుట్టుకుంటుందా? అన్నది చూడాలి. ఈ విషయంలో రానా భయపడుతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇక మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి. బాలీవుడ్ డ్రగ్స్ కేసు.. టాలీవుడ్ వరకు వస్తుందా? వస్తే ఎవరెవరు బయటకు వస్తారో చూడాలి.