రానా ఇంట్రెస్టింగ్ మూవీస్.. రెండు నెలల గ్యాప్ లోనే..

Rana About Health Issue In Samantha Sam Jam Show

రానా దగ్గుబాటి హీరోగా చేసినా.. విలన్ గా చేసినా.. ఆడియెన్స్ లో ఒకే రకమైన క్రేజ్ ఉంటుంది. రానా నటిస్తున్నాడు అంటే ఓ వర్గం ఆడియెన్స్ లో అంచనాల డోర్ అమాంతంగా పెరిగిపోతాయి. అతని కథల సెలక్షన్స్ పై ఆడియెన్స్ లో ఒక డిఫరెంట్ నమ్మకం ఏర్పడిందనే చెప్పాలి. ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక కొత్తధనం ఉంటుంది.
రానా `విరాట‌ప‌ర్వం` ప‌రిస్థితేంటి?
ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే రానా నుంచి సినిమా వచ్చి చాలా కాలమవుతోంది. కరోనా లేకపోయి ఉంటే ఈపాటికె రెండు సినిమాలు వచ్చేవి. అయితే సినిమాల విడుదలకు సాధారణంగా అయిదారు నెలల గ్యాప్ ఉండేది. కానీ ఇప్పుడు కేవలం రెండు నెలల గ్యాప్ లోనే రెండు డిఫరెంట్ సినిమాలు రాబోతున్నాయి. మొదట అరణ్య వస్తుండగా ఆ తరువాత విరటపర్వం రానుంది.

అరణ్య సినిమా పాన్ ఇండియన్ సినిమాగా రూపొందించిన విషయం తెలిసిందే. ఆ సినిమాను మార్చ్ చివరి వారంలో ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నారు. ఇక వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న విరటపర్వం సినిమా నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను మే చివరలో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అంటే రెండు సినిమాలకు కేవలం రెండు నెలల గ్యాప్ ఉండవచ్చని టాక్. మరి ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో క్లిక్కవుతాయో చూడాలి.