మహేష్ సినిమా కోసం రమ్యకృష్ణ కన్ఫామ్ అయినట్లేనా.?

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో సీనియర్ లేడీ రోల్స్‌కి ఇంపార్టెన్స్ ఎక్కువ. నదియా, టబు తదితరులు అలా ఫామ్‌లోకి వచ్చినవాళ్లే సెకండ్ ఇన్నింగ్స్‌లో. తాజా మూవీలోనూ ఆ తరహా సీనియర్ లేడీ రోల్ వుందట. పవర్ ఫుల్ రోల్ అనీ తెలుస్తోంది ఏజ్ యూజ్‌వల్.

అయితే, ఈ పాత్ర కోసం ఎవర్ని తీసుకోవాలా.? అని త్రివిక్రమ్ అండ్ టీమ్ గట్టిగా కసరత్తులు చేస్తున్నారట. ఆ క్రమంలో సీనియర్ నటి శోభన పేరు అనుకున్నారట. అలాగే ఓ బాలీవుడ్ సీనియర్ నటిని కూడా పరిశీలిస్తున్నారట.

చంకలో పిల్లాన్ని పెట్టుకుని ఊరంతా వెతికినట్లు.. రమ్యకృష్ణ వుండగా, ఎక్కడి నుండో తీసుకురావడమెందుకని కూడా ఆలోచిస్తున్నారట. రమ్యకృష్ణ అయితే పూర్తి న్యాయం చేయగలదన్న వుద్దేశ్యంతో ప్రస్తుతానికి ఆమె దగ్గరే ఆగిపోయారట. అన్నట్లు మరో సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ పేరు కూడా పరిశీలనలో వున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి, సివరాఖరికి ఎవరిని కన్‌ఫామ్ చేస్తారో.