Ram charan : ఆ టాప్ డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా… ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరబ్బా …?

Ram Charan : ఆర్ఆర్ఆర్ సినిమాతో నటుడుగా మరో మెట్టు పైకి వెళ్లిన రామ్ చరణ్ వరుస సినిమాలతో బిజీ గా ఉన్నాడు ప్రస్తుతం తన తండ్రితో కలిసి నటించిన కొరటాల దర్శకత్వంలో వస్తోన్న చిత్రం ఆచార్య సినిమా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సిద్ధం అనే ఒక పవర్ ఫుల్ నక్స్ లైట్ గా కనిపించనున్నారు. ఇక చరణ్ కి జోడిగా పూజ హెగ్డే నటించింది ఇక ఈ సినిమా మరీ కొద్ది రోజ్జుల్లో విడుదల కాబోతుంది.

ఇక రామ్ చరణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ జెర్సీ సినిమా దర్శకుడు గౌతమ్ తిన్ననురి దర్శకత్వంలో నటించనున్నారు. ఇక రామ్ చరణ్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ గురించి చెప్పి అందరిలోను ఆసక్తి పెంచారు. ఇక రామ్ చరణ్ ఆచార్య ప్రమోషన్స్ లో భాగంగా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఒక బడా డైరెక్టర్ తో చేయబోతున్నారని చెప్పి షాక్ ఇచ్చారు.

ఆ బడా డైరెక్టర్ తో మూడు నాలుగు కథలు ఉన్నట్లు చెప్పారని వివరించాడు చెర్రీ. మీరు చాలా పెద్ద డైరెక్టర్ నాతో ఏ కథ చేస్తే బాగుంటుందని, మీ కథల్లో ఏ పాత్రకు నేను బాగా సూటవుతానో మీకు కచ్చితంగా తెలుస్తుంది కాబట్టి మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే ఆ కథతో సినిమా చేద్దాం అని చెప్పారట. ఆ దర్శకుడు ఎవరనేది మాత్రం చరణ్ చెప్పలేదు. ఇక ఈ విషయం ఇపుడు ఈ విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇక ఆ దర్శకుడు ఎవరని అభిమానులు అంచనాలు వేసుకుంటున్నారు. ఇక ఆ డైరెక్టర్ త్రివిక్రమే అని డిసైడ్ అయ్యారు. ఇంతవరకు చెర్రీ, గురూజీ కాంబినేషన్ లో సినిమా చేయలేదు కాబట్టి చెర్రీ నెక్స్ట్ గురూజీ తో సినిమా చేయబోతున్నారని భావిస్తున్నారు. ఇక త్రివిక్రమ్ కుడా నెక్స్ట్ ప్రాజెక్ట్ మహేష్, తారక్ తో చేయబోతున్నారు. ఇక ఆ తర్వాత చెర్రీ తో సినిమా చేసే ఛాన్స్ ఉంది.