రామబాణం: బాక్సాఫీస్ టార్గెట్ ఫిక్స్!

గోపీచంద్‌ కథానాయకుడిగా శ్రీవాస్‌ దర్శకత్వంలో వస్తున్న రామబాణం చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంతకుముందు వీరి కలయికలో వచ్చిన లక్ష్యం, లౌక్యం, గోపీచంద్ కెరీర్ యొక్క మార్కెట్ విలువను పెంచింది. ఇక ఇప్పుడు ఈ కొత్త చిత్రం వారి విజయానికి తోడ్పడుతుందని భావిస్తున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌ని అలాగే ఆర్గానిక్ ఫుడ్‌కి ఉన్న ప్రాధాన్యతను హైలెట్ చేస్తూ విడుదల చేసిన ట్రైలర్ పాజిటివ్ బజ్‌ని క్రియేట్ చేసింది.

ఇక ఈ సినిమాను ఎన్ని థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు అనే వివరాల్లోకి వెళితే.. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో 625 థియేటర్లు, సీడెడ్‌లో 110 థియేటర్లు, అలాగే కర్నాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 165 థియేటర్లతో సహా ప్రపంచవ్యాప్తంగా 840 థియేటర్లలో ఈ చిత్రం విస్తృతంగా విడుదల కాబోతోంది.

బాక్సాఫీస్ వద్ద 15.20 కోట్ల బ్రేక్ ఈవెన్ సాధించడమే ఈ సినిమా టార్గెట్ కాగా, మొదటి వారంలో ఈ సినిమా ఎక్కువగా ఓపెనింగ్స్ రాబడుతుందని చిత్ర యూనిట్ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆకట్టుకునే కంటెంట్‌తో ఫ్యామిలీస్‌ని థియేటర్లకు రప్పించి మంచి రెస్పాన్స్‌ని సొంతం చేసుకుంటుందని చిత్ర నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు.

మొత్తంమీద, రామబాణం ఒక పాజిటివ్ బజ్ తో అయితే ఈ శుక్రవారం విడుదల అవుతోంది. ఇక దర్శకుడు, హీరో ఆకట్టుకునే ట్రాక్ రికార్డ్‌పై ఈ సినిమా ఆధారపడి ఉంటుంది. మంచి టాక్ వస్తేనే ఒపెనింగ్స్ బాగుంటాయి. ఇక పోటిగా అయితే పెద్ద సినిమాలు ఏమి లేవు. అల్లరి నరేష్ ఉగ్రంకు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా రామబాణంపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. మరి ఈ రెండు సినిమాల్లో ఏది బిగ్ హిట్ గా నిలుస్తుందో చూడాలి.