‘రామాయణం’ కోసం ప్రత్యేక శ్రద్ద… బంగారు ఆభరణాలనే ఉపయోగించబోతున్న టీమ్‌!

భారతీయ పురాణేతిహాసం రామాయణం ఆధారంగా నితేష్‌ తివారి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణ’. రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యశ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల చిత్రీకరణ మొదలైన సంగతి తెలిసిందే! భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది.

దీంట్లో రావణుడి పాత్రధారి ధరించనున్న దుస్తులు, ఆభరణాలు వాడే వస్తువులు అన్నీ నిజమైన బంగారంతో తయారు చేసినవే వినియోగించనున్నట్లు సమాచారం. ఎందుకంటే రావణుడు స్వర్ణ నగరమైన లంకకు అధిపతి. ఆయన ధరించిన వస్త్రాలు కూడా పసిడి మయమేనని ఇతిహాసాల్లో చెప్పారు. అందుకే సినిమాలోనూ ఆ పాత్రను అలాగే చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో యశ్‌ ముఖ్య పాత్ర పోషించడమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. దీన్ని భారతీయ భాషలతోపాటు పలు విదేశీ భాషల్లోనూ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.