మల్టీ స్టారర్ ప్లానింగ్‌లో రామ్ పోతినేని.!

యంగ్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం బోయపాటి శీను డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.

తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం, ఓ మల్టీ స్టారర్ సినిమా కోసం రామ్ పోతినేని ప్లాన్ చేస్తున్నాడనీ తెలుస్తోంది. గతంలో సీనియర్ హీరో వెంకటేష్‌తో కలిసి ‘మసాలా’ సినిమాలో నటించాడు రామ్ పోతినేని.

ఈ సారి ఓ యంగ్ స్టార్‌నే రామ్ ఎంగేజ్ చేసినట్లు తెలుస్తోంది. సొంత బ్యానర్‌లోనే ఈ సినిమా వుండబోతోందనీ తెలుస్తోంది. యాక్షన్ అండ్ మంచి ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా వుండబోతోందనీ తెలుస్తోంది.

డైరెక్టర్, హీరోయిన్ తదితర పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. ఈ మధ్య రామ్ పోతినేని‌కి సరైన హిట్టు పడలేదు. వరుస ఫెయిల్యూర్స్ బాధిస్తున్నాయి. బోయపాటి సినిమా రిజల్ట్ ఎలా వుండబోతోందో కానీ, మల్టీ స్టారర్‌ని బిగ్ బడ్జెట్‌తో ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.