రామ్ కూడా అందరిలాంటి వాడే.. అలాంటి పనులకు శ్రీకారం!!

సెలెబ్రిటీలకు నాలుగు చేతుల సంపాదన ఉంటుంది. ఇక ప్రత్యేకంగా హీరోయిన్ల గురించి చెప్పనక్కర్లేదు. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్, మ్యాగజైన్ ఫోటో షూట్లు ఇలా ఎన్నో రకాలుగా సంపాదిస్తుంటారు. ఇక అందరూ కామన్‌గా సంపాదించేది యాడ్స్.. బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటూ కోట్లకు కోట్లు వెనకేసుకుంటారు. కొందరు అదే పనిగా యాడ్స్‌లో నటిస్తూనే ఉంటారు. ఇంకొందరు మాత్రం కొన్ని కోట్లిచ్చినా వాటి జోలికి వెళ్లరు.

Ram Pothineni Garnier Color Shampoo Ad

ముఖ్యంగా టాలీవుడ్‌లో ఎండోర్స్‌మెంట్ యాడ్స్, బ్రాడ్ అంబాసిడర్ అంటే గుర్తుకు వచ్చేది మహేష్ బాబే. యాడ్స్‌లో నటించడం ద్వారా సంపాదించే మొత్తంలో మహేష్ బాబుదే అగ్రస్థానం. ఆ యాడ్ ఈ యాడ్ అని తేడా లేకుండా అన్నింట్లో నటించేస్తాడు. దాదాపు స్టార్ హీరోలందరూ ఏదో ఒక ఉత్పత్తికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన వారే.. వ్యవహరిస్తున్న వారే. కొందరు మాత్రం అలా తమకు ఉన్న క్రేజ్‌ను వాడుకుని జనాలు మభ్యపెట్టి ఉత్పత్తులను అమ్మే ప్రయత్నానికి ఒప్పుకోరు.

Ram Pothineni Garnier Color Shampoo Ad

ఆ కేటగిరీలో మొదటగా చెప్పుకోవాల్సింది బాలకృష్ణ గురించే. ఇంత వరకు ఒక్క ప్రొడక్ట్‌కి కూడా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించలేదు. ఈ తరం హీరోయిన్లలో సాయి పల్లవి కూడా అంతే. ఎన్ని కోట్లు ఇచ్చినా అలాంటి వాటికి ఒప్పుకోదు. అయితే తాజాగా ఇస్మార్ట్ హీరో, ఎనర్టిటిక్ స్టార్ రామ్ మొదటి సారిగా బ్రాండ్ అంబాసిడర్ అవతారం ఎత్తాడు. తెల్ల జుట్టు పోయి నల్లజుట్టు రావడానికి వాడే గార్నియర్ కలర్ షాంపు అంటూ జాన్ అబ్రహంతో కలిసి నటించాడు. ఇక ఇది తన మొదటి ప్రకటన కావడంతో రామ్ ఉబ్బితబ్బిబైపోతున్నాడు.