‘రెడ్’ తో రామ్ ఆశలు గట్టెక్కేనా?

Ram Movie Red

‘స్రవంతి’ మూవీస్‌లో  ఎనర్జిటిక్‌ స్టార్ రామ్ చాలా మంచి సినిమాలు చేశాడు.. సెన్సేషనల్‌ బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్‌’ తర్వాత  తాజాగా రామ్‌ హీరోగా చేసిన సినిమా ‘రెడ్’. కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై ‘స్రవంతి’ రవికిశోర్‌  నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కి విడుదల కానుంది.

Ram Movie Red
Ram Movie Red Poster

ఇదో స‌స్పెన్సు క్రైమ్ థ్రిల్ల‌ర్ కం ల‌వ్ ఎంట‌ర్ టైన‌ర్. ఆద్యంతం ఎమోష‌న్సు ర‌క్తి క‌ట్టిస్తాయట.  “కేవ‌లం క్రైమ్ ఎలిమెంట్ మాత్ర‌మే కాదు.. ఇందులో చ‌క్క‌ని ల‌వ్ స్టోరి ఉంది. మ‌ద‌ర్ సెంటిమెంట్.. ఎంట‌ర్ టైన్ మెంట్ హైలైట్ గా నిలుస్తాయి.” చిత్తం యూనిట్ చెబుతోంది. రామ్ కెరీర్ లో 18వ సినిమా ‘రెడ్‌’.  కిషోర్ దర్శకత్వంలో ఆయనకిది మూడో సినిమా .ఫస్ట్‌ టైమ్‌ కెరీర్‌లో ఒక థ్రిల్లర్‌ చేశాడు. మాస్‌ ఎలిమెంట్,  క్లాస్‌ఎలిమెంట్ అన్నీ ఉంటాయట.  

అలాగే రామ్‌తో  స్రవంతి మూవీస్‌లో కిషోర్ తిరుమల చేసిన మూడో సినిమా ఇది .  ‘రెడ్‌’ సినిమా కచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుందని నమ్మకంగా చెబుతున్నా. కథ కొత్తగా ఉంటుంది. ట్రీట్‌మెంట్‌ కూడా కొత్తగా ఉంటుంది. ఇది థ్రిల్లర్‌ అయినప్పటికీ కమర్షియల్‌గా ఉంటుంది” అని దర్శకుడు చెబుతున్నారు. రామ్‌తో నివేదా పేతురాజ్‌, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌ నటిస్తున్నారు. అయితే  రామ్ కు ‘రెడ్’ పై భారీ ఆశలే ఉన్నాయి. ఎందుకంటే సెన్సేషనల్‌ బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్‌’ తర్వాత  చేస్తున్న సినిమా కాబట్టి. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల కానుంది.