టాలీవుడ్‌లో 2020 మొత్తం పెళ్లి సందడిగానే మారింది. ఎంతో మంది సెలెబ్రిటీలు వివాహాలు చేసుకున్నారు. ఏడాది చివర్లోనూ పెళ్లిళ్లు అయ్యాయి. కొత్త ఏడాది ప్రారంభంలోనూ వివాహాలు చేసుకున్నారు. అలా బ్యాచ్‌లర్ లిస్ట్ చాలా వరకు తగ్గిపోయింది. స్టార్ హీరోలు పెళ్లి చేసుకున్నారు. ఇంకొందరు ద్వితీయ వివాహాంతో వార్తల్లోకి ఎక్కారు. రానా, నితిన్, నిఖిల్, దిల్ రాజు, సునీత, నిహారిక, కాజల్ ఇలా ఎంతో మంది తారలు పెళ్లిళ్లు చేసుకున్నారు.
ఇలా పెద్ద వారే కాకుండా చిన్న చిన్న సెలెబ్రిటీలు ఎంతో మంది పెళ్లిళ్లు చేసుకున్నారు. అయితే ఇంకా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ లిస్ట్‌లొ చాలా మంది హీరోలున్నారు. శర్వానంద్, రామ్, సాయి ధరమ్ తేజ్ ఇలా చాలా మంది హీరోలున్నారు. అయితే వీరిలో శర్వానంద్ పెళ్లి మాత్రం దగ్గర్లోనే ఉన్నట్టు కనిపిస్తోంది. అలాగే సాయి ధరమ్ తేజ్ పెళ్లి కూడా త్వరలోనే జరగబోతోన్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇక ఇస్మార్ట్ హీరో రామ్ పెళ్లిపై మాత్రం ఎప్పుడు కూడా ఎలాంటి రూమర్లు, వార్తలు రావు. కానీ తాజాగా ఆయన అభిమానులు పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు సంధించారు. దీంతో రామ్ ఆ విషయంపై మాట్లాడక తప్పలేదు. పెళ్లి అనేది జరగాల్సిన సమయంలో అది జరుగుతుంది. మనచేతుల్లో ఉండదంటూ సింపుల్‌గా తప్పించుకున్నాడు. రామ్ మొత్తానికి RED సక్సెస్ సంబరాల్లో మునిగిపోతున్నాడు.