ఓటిటిలో “రానా నాయుడు” రచ్చపై వర్మ వ్యూ.!

గత కొన్ని రోజులు నుంచి ఓటిటి లో సెన్సేషన్ గా మారిన సిరీస్ ఏదన్నా ఉంది అంటే అది డెఫినెట్ గా దగ్గుబాటి వారి కుటుంబం నుంచి అవైటెడ్ గా మారిన సిరీస్ “రానా నాయుడు”. ప్రపంచ దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యిన ఈ సిరీస్ మొదటి రోజు నుంచే ఆడియెన్స్ నుంచి ఊహించని రెస్పాన్స్ ని అందుకుంది.

కాగా ఈ సిరీస్ లో అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉందని ఇలాంటి సిరీస్ లా చేస్తారు అంటూ కొందరు మేధావులు విమర్శలు చేసినప్పటికీ ఓవరాల్ గా అయితే ఈ సిరీస్ లో నెట్ ఫ్లిక్స్ లో ఇండియా వైడ్ గా దుమ్ము దులిపేస్తుంది. గత కొన్ని రోజులు నుంచి ఇండియా వైడ్ గా టాప్ 2 లిస్ట్ లో ఆల్ టైం నెంబర్ 1 షో గా ట్రెండ్ అవుతున్న ఈ సిరీస్ పై లేటెస్ట్ గా సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పలు ఆసక్తికర కామెంట్స్ చేసాడు.

ఇండియాస్ నెంబర్ 1 సిరీస్ గా నిలిచినందుకు రానా మరియు వెంకటేష్ లకు కంగ్రాట్స్ తెలియజేస్తున్నానని ప్రపంచ వ్యాప్తంగా రామానాయుడు గారి కొడుకు అలాగే మనవడు తమ జెండాను ఎగరేస్తున్నారు అంటూ వర్మ అదిరిపోయే వ్యూ తన స్పందన గా అందించారు. దీనితో రానా మరియు దగ్గుబాటి అభిమానులు రామ్ గోపాల్ వర్మ రియాక్షన్ తో అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అయితే రానా నాయుడు రచ్చ రచ్చ చేస్తున్నాడని చెప్పాలి.