లేటెస్ట్ : ‘స్కంద’ లో దంచి కొట్టేసిన రామ్, శ్రీలీల కనిపించలేదు.!

ప్రస్తుతం రానున్న రోజుల్లో మన టాలీవుడ్ నుంచి ఉన్న పలు ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ రిలీజ్ లలో ఉస్తాద్ రామ్ పోతినేని అలాగే బోయపాటి శ్రీను కాంబినేషన్ రిలీజ్ “స్కంద” కూడా ఒకటి. మరి బాలయ్యతో “అఖండ” లాంటి భారీ విజయం తర్వాత దర్శకుడు బోయపాటి శ్రీను రామ్ తో అనౌన్స్ చేసిన ఉహించని మాస్ సబ్జెక్టు ఇది.

పైగా ఈ చిత్రం పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా కూడా అనౌన్స్ చేయడంతో భారీ హైప్ నెలకొనగా ప్రతి అప్డేట్ తో కూడా క్రేజీ హైప్ ని మేకర్స్ పట్టుకున్నారు. ఇక ఈ చిత్రంలో అయితే శ్రీ లీల హీరోయిన్ గా నటించగా మేకర్స్ ఈరోజు సినిమా మొదటి పాటని ఐతే రిలీజ్ చేశారు.

సంగీత దర్శకుడు థమన్ అందించిన ఈ మొదటి సాంగ్ మాత్రం వినడానికి మరీ అంత హిట్ గా అనిపించలేదు కానీ ఈ సాంగ్ లో రామ్ చేసిన డాన్స్ క్రేజీ అని చెప్పి తీరాలి. ఇందులో తాను చేసిన ప్రతి మూమెంట్ కూడా వింటేజ్ రామ్ ని చూపించింది. అయితే రామ్ ఇప్పటికీ తన డాన్స్ ని వదల్లేదు కానీ ఈ సాంగ్ లో అయితే రామ్ కుమ్మేసాడు అనాల్సిందే.

పైగా నాటు నాటు కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈ సాంగ్ కి వర్క్ చేయడం విశేషం కాగా ఆ రేంజ్ లోనే సాంగ్ కూడా ఉందని చెప్పి తీరాలి. అయితే ఇంట్రెస్టింగ్ గా శ్రీలీల ఇది వరకు హీరోస్ ని డామినేట్ చేసేది అనేవారు కానీ ఈ సాంగ్ లో మాత్రం రామ్ పోతినేని కంప్లీట్ డామినేషన్ చూపించాడు. దీనితో శ్రీ లీల అయితే రామ్ ముందు తేలిపోయింది అని చెప్పక తప్పదు. ఇక ఈ చిత్రం అయితే పాన్ ఇండియా వైడ్ గా ఈ సెప్టెంబర్ 15న రిలీజ్ కాబోతుంది. 
Nee Chuttu Chuttu (Lyrical Video) | Skanda | Ram Pothineni, Sree Leela | Boyapati Sreenu | Thaman S