కృష్ణ మహేష్ బాబులను పరామర్శించిన రామ్ చరణ్ ఉపాసన దంపతులు.. వైరల్ అవుతున్న ఫోటోలు?

గత నెలలో సినీ ఇండస్ట్రీలో ఎంతో విషాదం చోటుచేసుకుంది. ఒకే నెలలోనే రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణించడం అందరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.ఇకపోతే ఈ విషయం మర్చిపోకముందే సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఇందిరా దేవి మరణించడం అభిమానులను మరింత కృంగదీసింది. ఈ విధంగా ఇందిరాదేవి మరణించడంతో ఎంతోమంది సినీ సెలబ్రిటీలు మహేష్ బాబు ఇంటికి చేరుకొని ఇందిరా దేవి కి నివాళులు అర్పించారు.

ఇకపోతే ఇందిరా దేవి గారు 11వ రోజు కార్యక్రమాలను మహేష్ బాబు పూర్తి చేశారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు సినీ సెలబ్రిటీలు హాజరయ్యి ఇందిరా దేవి నివాళులు అర్పించారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా రామ్ చరణ్ ఉపాసన దంపతులు కూడా హాజరై ఇందిరా దేవికి నివాళులు అర్పించారు.ఇందిరా దేవికి నివాళులు అర్పించిన అనంతరం రామ్ చరణ్ ఉపాసన దంపతులు కృష్ణ గారితో ముచ్చటించారు. అనంతరం మహేష్ బాబుతో రామ్ చరణ్ మాట్లాడుతూ ఆయనను పరామర్శించగా, ఉపాసన నమ్రత సితారాలతో కలిసి వారిని పరామర్శించి అనంతరం ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

ఈ విధంగా రామ్ చరణ్ ఉపాసన దంపతులు మహేష్ బాబు నమ్రత దంపతులను కలిసి పరామర్శించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇకపోతే తల్లి మరణంతో మహేష్ బాబు నటిస్తున్న సినిమాకి కొన్ని రోజులపాటు విరామం ప్రకటించారు.కొడుకుగా తన తల్లి కార్యక్రమాలన్నింటినీ మహేష్ బాబు పూర్తి చేసే పనిలో ఉన్నారు.ఈ క్రమంలోనే తాను నటిస్తున్న సినిమాకి విరామం ప్రకటించినట్లు తెలిపారు.ప్రస్తుతం ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసింది.