సంక్రాంతి పోరు.. RC 15 అవుట్?

SSMB 28 ప్రాజెక్ట్ 2024 సంక్రాంతి జనవరి 13న రాబోతోందని అధికారికంగా క్లారిటీ ఇచ్చారు. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కాబట్టి ఆ ఫెస్టివల్ పర్ఫెక్ట్ అని చెప్పవచ్చు. ఇక ప్రభాస్ బిగ్ బడ్జెట్ పాన్ వరల్డ్ మూవీ Project K జనవరి 12 రిలీజ్ అని ముందే క్లారిటీ ఇచ్చారు.

అయితే శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ RC 15 కూడా అదే టైమ్ కు రావచ్చని మొన్నటి వరకు కొంత టాక్ వచ్చింది. అయితే మహేష్ సినిమాపై క్లారిటీ రావడంతో ఇప్పుడు RC 15 రాదని క్లారిటీ వస్తోంది. ఎందుకంటే మహేష్ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లో దిల్ రాజు హ్యాండ్ ఉంది.

నైజాం, వైజాగ్ ఏరియా డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఆయన తీసుకుంటున్నారు. కాబట్టి ఆయన బ్యానర్ లో వస్తున్న RC 15 సంక్రాంతికి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఆయన ఆ రేంజ్ లో రిస్క్ తీసుకోరని చెప్పవచ్చు. ఇక RC 15 ప్రాజెక్ట్ 2024 సమ్మర్ లో రావాల్సిందే.

2024 సంక్రాంతికి మరో సినిమా కూడా రానుంది. కింగ్ నాగార్జున రైటర్ ప్రసన్న దర్శకత్వంలో చేయబోతున్న సినిమా కూడా సంక్రాంతికి రానుంది. ఇక ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూట్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. నాగ్ ఫోకస్ అయితే సంక్రాంతిపైనే ఉంది. ఇక ఈ క్లాష్ లో ప్రాజెక్ట్ కూడా ఉండకపోవచ్చని ఆ మధ్య ఒక టాక్ వచ్చింది. కానీ ఇంకా ఆ విషయంలో వైజయంతి ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు.