శర్వానంద్ పెళ్లికి కోట్లు విలువచేసే బహుమతి అందించనున్న రామ్ చరణ్?

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోలు ప్రాణ స్నేహితులుగా ఉంటున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మెగా వారసుడు రామ్ చరణ్ అలాగే హీరో శర్వానంద్ కూడా ఇద్దరూ మంచి స్నేహితులు. వీరు చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్ మాత్రమే కాకుండా వీరిద్దరి మధ్య ఎంతో మంచి అనుబంధం ఉందనే విషయం అందరికీ తెలిసిందే. ఇక శర్వానంద్ మెగా ఫ్యామిలీకి మధ్య కూడా మంచి రిలేషన్ ఉంది. ఈ క్రమంలోనే త్వరలోనే శర్వానంద్ ఓ ఇంటి వాడు కాబోతున్నారని తెలియడంతో తన స్నేహితుడికి రామ్ చరణ్ ఖరీదైన గిఫ్ట్ ఇవ్వబోతున్నారట.

గత కొద్దిరోజులుగా శర్వానంద్ పద్మ అనే ఒక ఎన్నారై అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. వీరి నిశ్చితార్థం కూడా జనవరి 26వ తేదీ హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్లో జరుగుతుందని నిశ్చితార్థపు ఇన్విటేషన్ కార్డు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇలా శర్వానంద్ పెళ్లి చేసుకోబోతున్నారని తెలియడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.జనవరి 26వ తేదీ నిశ్చితార్థం జరుపుకోనున్న శర్వానంద్ ఫిబ్రవరి నెలలోనే వివాహం చేసుకోబోతున్నారని సమాచారం.

ఇలా తన స్నేహితుడు ఓ ఇంటి వాడు కాబోతున్న నేపథ్యంలో రామ్ చరణ్ కూడా తనకు ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన స్నేహితుడు శర్వానంద్ కురామ్ చరణ్ ఏకంగా మూడు కోట్ల విలువ చేసి ఖరీదైన కారును బహుమానంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇక ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీరిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ఎలాంటిదో అందరికీ అర్థమవుతుంది. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే వేచి చూడాలి.