Upasana: భారీ బడ్జెట్ తో భారీ అంచనాల మధ్య తాజాగా విడుదలైన చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఇప్పటికే ఎంత ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసిందే. కరోనా మరియు కొన్ని కారణాల వల్ల వాయిదల పర్వం కొనసాగినా మొత్తానికి ఈ మూవీ రిలీజ్ అవడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. టికెట్ బుకింగ్స్ ఓపెన్ ఐనా నిమిషాల్లోనే ఫిల్ అవ్వడం ఆ సినిమాకు ఎంత క్రేజ్ ఏర్పడిందో తెలియజేస్తుంది. టికెట్ ధరలు పెంచినా కూడా, వాటినేమీ లెక్క చేయకుండా ఫ్యాన్స్ పోటీ పడీ మరీ సినిమా ఎలాగైనా చూడాలని ఆత్రుత పడుతున్నారు. టికెట్ దొరకడమే గొప్ప విజయంగా వారు భావిస్తున్నారు అంటే ఆ సినిమాకు ఏ లెవెల్ లో హైప్ ను తీసుకొచ్చారో తెలుస్తూనే ఉంది.
ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ కోసం మామూలు ప్రేక్షకులు, కరడు గట్టిన అభిమానులే కాదు సినీ సెలబ్రిటీలు సైతం వెయిట్ చేస్తున్నారు అంటే మామూలు విషయం కాదు. ఇప్పటికే ఎంతో మంది ఈ సినిమా కోసం స్పెషల్ స్క్రీనింగ్ ను బుక్ చేసుకున్న విషయం తెలిసిందే.
ఇక మామూలు ప్రేక్షకులే అంతగా ఎదురు చూస్తుంటే, ఆ హీరోస్ కి చెందిన ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు ఎంతగా ఎదురు చూసి ఉంటారో కదా. ఐతే ఆర్ ఆర్ ఆర్ సినిమాకు ఇప్పటికే బెనిఫిట్ షోస్ కూడా రిలీజ్ కావడంతో వారి ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబెర్స్ కూడా ఆ సినిమాను చూశారు. నేపథ్యంలోనే రామ్ చరణ్ భార్య ఉపాసన సైతం ఆర్ ఆర్ ఆర్ సినిమా చూసి థియేటర్లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. తెరపైన నాటు నాటు సాంగ్ వస్తున్నప్పుడు పేపర్స్ చింపుతూ, వాటిని గాల్లోకి ఎగరేస్తూ తెగ ఎంజాయ్ చేసిందట. వాటిని అప్పటికే ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకుల మీద కూడా విసిరి తన ఆనందాన్ని వ్యక్తం చేశారట. దీనికి సంబంధించి ఒక వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ప్రస్తుతం ఈ సినిమా సౌత్ లోనే కాక, నార్త్ లో కూడా పాసిటివ్ టాక్ తెచ్చుకుంటుంది.