Ram Charan : రామ్ చరణ్ సింప్లిసిటీ చూసి ఫిదా అవుతున్న బాలీవుడ్ జనాలు..బాలీవుడ్ హీరోలు చూసి నేర్చుకోవాలంటూ హితవు…!

Ram Charan  : ఆర్ఆర్ఆర్ తర్వాత మెగాస్టార్ పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ మాములుగా లేదు పాన్ ఇండియా లెవెల్లో పాపులర్ అయ్యాడు . ఇక రామ్ చరణ్ తన నెక్స్ట్ మూవీస్ ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు.శంకర్ తో ఒక ఇంట్రస్టింగ్ మూవీ చేస్తున్న చెర్రీ తన తండ్రి తో కలిసి ఆచార్య మూవీ లో నటిస్తున్నారు కొరటాల దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమాలో చరణ్ మావోయిస్టు గా నటిస్తున్నారు.

చరణ్ ఆర్ఆర్ఆర్ సక్సెస్ ను ఆస్వాదిస్తూనే తనని తాను ప్రమోట్ చేసుకోవాలని భావించి ముంబై థియేటర్ కి వెళ్లి ప్రేక్షకులను ఆశ్చర్య పరిచాడు. చరణ్ ముంబై వెళ్ళినపుడు ప్రైవేట్ విమానాశ్రయం నుండి బయటికి వస్తు ఉన్న వీడియోలను కొందరు షేర్ చేసారు అందులో రామ్ చరణ్ చెప్పులు లేకుండా ఉండటం ఇప్పుడు వైరల్ అయింది.

చరణ్ అయ్యప్ప మాల వేయడంతో చెప్పులు లేకుండా తిరుగుతున్నారు. దీంతో ముంబై ఎయిర్ పోర్ట్ లో కూడా అలాగే కనిపించారు. ఇక ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. ఇక చాలా మంది బాలీవుడ్ హీరోలు సౌత్ హీరోలను చూసి నేర్చుకోవాలంటూ సటైర్ లు వేస్తున్నారు. రామ్ చరణ్ సింప్లిసిటీ చూసి ఫిదా అవుతున్నారు. ఇక రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆనందంకి అవధుల్లేవ్.ఇటీవలే రామ్ చరణ్ తులం బంగారం ను ఆర్ఆర్ఆర్ కు పనిచేసిన సాంకేతిక నిపుణులకు ఒక్కరికి తులం చొప్పున బహుమతిగా ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే.