సేల్స్ మెన్ గా మారిపోయిన రామ్ చరణ్… వైరల్ అవుతున్న వీడియో!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సెలబ్రిటీల చుట్టూ ఎన్నో కంపెనీలు ప్రదక్షిణలు చేస్తూ తమ బ్రాండ్లను ప్రమోట్ చేయాలని కోరుతుంటారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా కొనసాగుతున్న వారందరూ కూడా పెద్ద ఎత్తున ఎన్నో రకాల బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఆ ఉత్పత్తులను ప్రమోట్ చేస్తుంటారు.ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ఈ విధంగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న వారు కూడా ప్రస్తుతం వరుస యాడ్స్ చేస్తూ సందడి చేస్తున్నారు.ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ బాబు ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్ విజయ్ దేవరకొండ సమంత రష్మిక వంటి సెలబ్రిటీలు పెద్ద ఎత్తున తమ బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్నారు. ఇకపోతే తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరొక కొత్త యాడ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.అయితే ఈ యాడ్ కేవలం రామ్ చరణ్ మాత్రమే కాకుండా నటి రష్మిక క్రికెటర్స్ రోహిత్ శర్మ, గంగూలి కూడా ఉండడం విశేషం.

ఇలా ఈ నలుగురు సెలబ్రిటీలు కలిసి ప్రముఖ ఆన్లైన్ వస్త్ర వ్యాపారమైనటువంటి మీషో బ్రాండెను ప్రమోట్ చేస్తూ చేసిన యాడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఇందులో రష్మిక రామ్ చరణ్ రండి బాబు రండి రంగురంగుల దుస్తులు నచ్చిన దుస్తులు అంటూ కస్టమర్లను ఆహ్వానిస్తున్నట్లు కనిపించారు. రష్మిక రామ్ చరణ్ మాత్రమే కాకుండా గంగూలి రోహిత్ శర్మ సైతం ఎంతో అద్భుతంగా నటించారని చెప్పాలి. ఇకపోతే మీ షో కోసం విజయ్ దేవరకొండ సమంత సెలబ్రిటీలు కూడా పెద్ద ఎత్తున ప్రమోటర్లుగా వ్యవహరించారు . అయితే ప్రస్తుతం మీ షో కోసం రామ్ చరణ్, రష్మిక, రోహిత్, గంగూలీ ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్నారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.