Ram Charan : గౌతమ్ తిన్ననూరి విషయంలో రామ్ చరణ్ సరైన నిర్ణయం తీసుకుంటున్నాడా..?

Ram Charan : రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎన్టీఆర్,రామ్ చరణ్ లకు ఘన విజయం అందించడమే కాకుండా, పాన్ ఇండియా రేంజ్ లో ఇమేజ్ ని తెచ్చిపెట్టింది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ రామ్ చరణ్ తదుపరి చిత్రాల పైనే అందరి దృష్టి ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల దర్శకత్వంలో ఒక సినిమా ని మొదలు పెట్ట పోతున్నాడు. ఇక రామ్ చరణ్ కొరటాల దర్శకత్వంలో నటించిన ఆచార్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆచార్య సినిమానే కాకుండా రాంచరణ్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా కూడా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది.

ఈ రెండు సినిమాల తర్వాత రామ్ చరణ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నట్టు సమాచారం. అయితే గౌతమ్ తిన్ననూరి సుమంత్ హీరోగా మళ్ళీరావా అనే మొదటి సినిమాతోనే హిట్ టాక్ సంపాదించుకున్నాడు. తర్వాత నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన జెర్సీ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా జాతీయ పురస్కారాన్ని కూడా అందుకుంది. అంతేకాకుండా జెర్సీ సినిమా హిందీ రీమేక్ ని కూడా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. హిందీ వర్షన్ జెర్సీ సినిమాలో షాహిద్ కపూర్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఫీల్ గుడ్ మూవీగా మంచి టాక్ సంపాదించుకుంది అప్పటికీ కలెక్షన్లు రాబట్టలేకపోతోంది.

కే జి ఎఫ్ 2 సినిమా కలెక్షన్ లా దెబ్బకి జెర్సీ సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోతున్నాయి. ఈ సినిమా కలెక్షన్లు పడిపోవడం ఏమో కానీ రామ్ చరణ్ ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైంది. ప్రస్తుతం శంకర్ రామ్ చరణ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సినిమా తర్వాత వస్తున్న గౌతమ్ తిన్ననూరితో సినిమా విషయంలో రామ్ చరణ్ సరైన నిర్ణయం తీసుకుంటున్నారా లేదా అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే రామ్ చరణ్ కథ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడని తను ఎంచుకున్న కథ చిరంజీవికి కూడా నచ్చితే మాత్రమే మొదలు పెడుతున్నారని సమాచారం. అయితే రామ్ చరణ్ హీరోగా గౌతమ్ తిన్ననూరి భారీ బడ్జెట్ సినిమాని హ్యాండిల్ చేయగలడా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా ఉంది.