మొదలైన రామ్ చరణ్ కొత్త సినిమా షూటింగ్.. టైటిల్ ఇదేనా?

రాంచరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కొన్ని నెలల ముందే ఈ సినిమా టీం అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది. ఈ సినిమా విలేజ్ థీమ్ తో ఒక స్పోర్ట్స్ డ్రామా లా నడుస్తుంది అన్న ప్రచారాలు సాగుతున్నాయి. జాహ్నవి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ స్వరాలు అందిస్తున్నారు.

సినిమాలో రామ్ చరణ్ కొత్త లుక్ లో ఉండబోతున్నారు. అలాగే కన్నడ హీరో శివరాజ్ కుమార్ కూడా సినిమాలో ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిపి నిర్వహిస్తున్నారు. ఈ సినిమా దర్శకుడు అయిన బుచ్చిబాబు సన తాజాగా మైసూర్ లో చాముండేశ్వరి అమ్మవారి గుడికి వచ్చి ఈ సినిమా పేపర్లను అమ్మవారి దగ్గర పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు.

సినిమా ఫస్ట్ షెడ్యూల్ మైసూర్లో మొదలైంది, మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్లో చాలా ముఖ్యమైన సన్నివేశాలు షూట్ చేస్తున్నారని, ఇందులో రామ్ చరణ్ సీన్స్ కూడా కొన్ని ఉన్నాయని ప్రచారాలు ఉన్నాయి. దర్శకుడు సుకుమార్ దగ్గర పని చేసిన బుచ్చిబాబు సనా మొదటి చిత్రం “ఉప్పెన” తోనే ఒక మంచి బ్లాక్ బస్టర్ ని అందుకుని తన సత్తా చూపించాడు.

రెండో సినిమా రామ్ చరణ్ తో తీయడానికి రెండు సంవత్సరాల పాటు ఈ స్క్రిప్ట్ మీదే పని చేస్తూ స్టోరీని డెవలప్ చేశారు. ఈ సినిమాకు “పెద్ది” అనే టైటిల్ మాటల్లో ఉన్నదని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా రాంచరణ్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న “గేమ్ చేంజర్” సినిమా విడుదలకు దగ్గరలో ఉంది. జనవరి 10న విడుదల అవ్వబోతున్న ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ పూర్తి డేట్స్ అన్ని బుచ్చిబాబు సనా సినిమాకే అంకితం. మరి ఈ సినిమా అప్డేట్ల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.