రెహమాన్ పేరు వినగానే సంగీత ప్రియులకు చక్కటి మెలోడీలు, అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్లు గుర్తొస్తాయి. కానీ తెలుగులో మాత్రం ఆయన సంగీత ప్రయాణం అంత గొప్పగా నిలిచిందా అంటే సందేహమే. ‘సూపర్ పోలీస్’ నుండి ‘కొమరం పులి’ వరకు వచ్చిన సినిమాల్లో రెహమాన్ మ్యాజిక్ కనిపించలేదు. అప్పట్లో నాని సినిమాకు ఇచ్చిన మ్యూజిక్ మాత్రమే హైలెట్ అయ్యింది. కానీ సినిమా ఫ్లాప్. ఇక మధ్యలో ‘ఏ మాయ చేశావే’, ‘సాహసం శ్వాసగా సాగిపో’ లాంటి ఆల్బమ్స్ ఆకట్టుకున్నా… వాటిలో కూడా ఓవర్ ఆల్గ్ టెక్నికల్ హంగులు ఎక్కువై హార్ట్ టచ్ మిస్ అయ్యింది.
ఇదే కారణంగా రెహమాన్‌కి తెలుగులో బ్లాక్‌బస్టర్ మ్యూజిక్ ఇవ్వలేదన్న భావన నెలకొంది. ఇప్పుడు అదే మారనుందా అనే ఆసక్తిని కలిగించింది రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘పెద్ది’. ఇటీవల విడుదలైన టీజర్‌లో రెహమాన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆశలు రేకెత్తించింది. బుచ్చిబాబు గతంలో ‘ఉప్పెన’తో సూపర్ హిట్ ఆల్బమ్ అందించగా, ఇప్పుడు రెహమాన్‌తో కలిసి ఎలా మ్యాజిక్ చేస్తాడా? అనే ఆసక్తి ఉత్పన్నమవుతోంది.
టీజర్‌లో వినిపించిన సంగీతం కొత్త ఊపునిస్తోందన్న మాట వినిపిస్తోంది. ఇప్పటికే మూడు పాటల రికార్డింగ్ పూర్తయిందని సమాచారం. ఈ పాటల్లో ఏదైనా ఒకటి ఆల్ టైమ్ చార్ట్‌బస్టర్ అయితే రెహమాన్‌కి ఇది రీబర్న్ అవుతుందనే చెప్పొచ్చు. ‘థగ్ లైఫ్’ ఆల్బమ్, బీజీఎమ్ విషయంలో అభిమానుల్ని నిరాశపరిచిన రెహమాన్… ఇప్పుడు ‘పెద్ది’లో ఎలాంటి సంగీతం అందిస్తాడోననే ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది. ఈ సినిమాకు వింటేజ్ విలేజ్ బ్యాక్‌డ్రాప్ ఉండటంతో, మణిరత్నం పాత సినిమాల్లో విన్న అట్టిగళ్లు మెలోడీలు మళ్లీ వినిపిస్తాయేమో అన్న నమ్మకం మెగా అభిమానుల్లో ఉంది. ఇక వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ అయ్యే పెద్ది చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. మ్యూజిక్ రంగంలో ఈ సినిమా మ్యాజిక్ చేస్తే మాత్రం, రెహమాన్‌కు ఇది తెలుగులో ఫుల్ ఫ్లెజ్డ్ రీ ఎంట్రీ అయి నిలిచిపోతుంది.