తండ్రి కాబోతున్న రామ్ చరణ్..ఇందులో నిజమెంత?

మెగా కుటుంబానికి సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటుంది. అయితే మెగా కుటుంబానికి సంబంధించిన ఒక వార్త మాత్రం చాలా కాలంగా చాలా గట్టిగా వినపడుతోంది. ఆ వార్త మరేదో కాదు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు అన్న వార్త. ఉపాసన, రాంచరణ్ వివాహం జరిగి దాదాపు 10 ఏళ్లు పూర్తి కావస్తోంది. అయితే వీరి వివాహం జరిగిన దగ్గరినుండి మెగా వారసుడు ఎప్పుడేప్పుడు వస్తాడా అంటూ అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ విషయంలో మాత్రం ఇంకా చాలా సమయం ఉంది అంటూ ఉపాసన కొట్టి పారేస్తూ వచ్చింది.

ఈ విషయం గురించి ఎన్నోసార్లు ఉపాసన వద్ద ప్రస్తావించినా కూడా అది తమ వ్యక్తిగత విషయం అని సమాధానం చెబుతూ వచ్చింది. ఇక వినాయక చవితి సందర్భంగా వినాయక నిమజ్జనంలో పాల్గొన్న ఉపాసన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఆ ఫోటోలలో ఉపాసన బేబీ బంప్ తో ఉండటం వల్ల మెగా కుటుంబానికి వారసుడు రాబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్త సోషల్ మీడియాలో ఎన్నోసార్లు వినిపించినా కూడా ఈసారి మాత్రం చాలా గట్టిగా వినిపిస్తోంది.

అయితే ఈ విషయాన్ని మెగా కుటుంబం అధికారికంగా ప్రకటించనప్పటికీ.. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం మరొక 5, 6 నెలలలో మెగా కుటుంబంలో బుజ్జి బుజ్జి అడుగులు పడబోతున్నాయి. వారసుడి రాక కోసం మెగాస్టార్ దంపతులు పదేళ్లుగా ఎదురుచూస్తున్నారు. మరి కొన్ని రోజులలో వారి చిరకాల కోరిక నెరవేరబోతోంది. ఇంతకాలం తన వ్యక్తిగత జీవితం కోసం పిల్లలను వద్దనుకున్న ఉపాసన ఇక ఇప్పుడు తన అత్తగారి కోరిక నెరవేర్చడానికి సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలలో నిజం ఉందో? లేదో ? తెలియదు కానీ మెగా అభిమానులు మాత్రం వారసుడొస్తున్నాడని సంబరాలు జరుపుకుంటున్నారు.