Ram Charan : కొత్త లుక్ లో షాక్ ఇచ్చిన చెర్రీ… శంకర్ సినిమాలో డబుల్ ధమాకా ఇస్తున్నాడా…!

Ram Charan : ఆర్ ఆర్ ఆర్ వంటి సూపర్ హిట్ తర్వాత రామ్ చరణ్ రాజమౌళి లాంటి అగ్రదర్శకులలో ఒకరైనా శంకర్ దర్శకత్వం లో నటిస్తున్నారు.ఈ సినిమాను ఒక యాక్షన్ చిత్రం గా తెరకేక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఆర్ ఆర్ ఆర్ వంటి ఘన విజయం తర్వాత వస్తున్న సినిమా కావడం అందులోను శంకర్ దర్శకత్వం లో వస్తున్న సినిమా కావడం తో ఈ సినిమా మీద అంచనాలు పెరిగాయి.

తాజాగా ఈ సినిమా గురించి కొత్త వార్తలు వినిపిస్తున్నాయ్.ఈ సినిమా లో అభిమానులకు రామ్ చరణ్ డబల్ ధమాకా ఇస్తున్నట్టు సమాచారం.ఈ సినిమాలో రామ్ చరణ్ ద్వి పాత్రల్లో నటిస్తున్నట్టు సమాచారం.రెండిటిలో ఒక పాత్ర లో ఒక వయసు ఐనా రాజకీయ నేత గా కనిపిస్తారట. మరొక పాత్రలో ఒక యంగ్ ప్రభుత్వ ఉద్యోగిగా కనిపిస్తున్నారట.వయసు ఐనా రామ్ చరణ్ పాత్ర కు అంజలి హీరోయిన్ గా ను, యంగ్ రామ్ చరణ్ పాత్ర కు కైరా అద్వానీ హీరోయిన్ గా చేస్తున్నారట.

ఈ సినిమాని దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.శంకర్ ఈ సినిమాలోని రెండు పాత్ర ల మద్య వైవిద్యాన్ని చక్కగా చూయించ పోతున్నారట. పొలిటికల్ బాక్గ్రౌండ్ లో వస్తున్న ఈ సినిమా లో రెండు పాత్రలు నటన పరంగా వైవిద్యమైన పాత్రలే. ఈ రెండు పాత్రాలను నటించి మెప్పించడం రామ్ చరణ్ కు ఓక సవాల్ లాంటిదే. చూడాలి మరి ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎలా అలాటిస్తుందో చూడాలి.