Ram charan : ఇద్దరు అగ్ర దర్శకులను ఒకేసారి హ్యాండిల్ చేసిన చెర్రీ.. వావ్ అంటున్న అభిమానులు…!

 

Ram Charan: ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ తో కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ విడుదలకు సిద్ధంగా ఉండటం అందరికీ తెలిసిందే. ఆర్ఆర్ఆర్ ఈ సినిమాకి దర్శకుడు అయిన రాజమౌళి దర్శకత్వం వహించారు. ఈ సినిమాని మార్చి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ చురుగ్గా జరుగుతున్నాయి. సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుకలు అంగరంగ వైభవంగా జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు,త్వరలోనే తేదీని కూడా అధికారికంగా ప్రకటించపోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ యాక్టివిటీస్ లో భాగంగా చరణ్ చాలా బిజీగా గడుపుతున్నారు.

మరోవైపు ఇంకొక దిగ్గజ దర్శకుడు అయినా శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమాల్లో కూడా రామ్ చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ షూటింగ్ పనులు కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ మధ్యనే షూటింగ్ కి సంబంధించిన కొన్ని షెడ్యూల్ పూర్తి చేసుకొని రామ్ చరణ్ నా భార్య ఉపాసనతో కలిసి ఫిన్ లాండ్ కు వెకేషన్ కూడా వెళ్లి వచ్చారు. వెకేషన్ నుండి వచ్చాక ప్రస్తుతం ఒకవైపు ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ పనులు,మరొకవైపు శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా పాల్గొంటూ అందరి చేత వావ్ అనిపించుకుంటున్నారు.

శంకర్ ,రాజమౌళి ఇద్దరు అగ్ర దర్శకుల సినిమాల లో ఒకేసారి పనిచేయడం మామూలు విషయం కాదు. ఉదయం ఆర్ ఆర్ ఆర్ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ పనుల్లో పాల్గొంటూనే,రాత్రి సమయాల్లో శంకర్ సినిమా షూటింగ్లో కూడా పాల్గొన్నారు. ఇలా ఇద్దరు అగ్ర దర్శకులతో ఒకేసారి పనిచేస్తుండటంతో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు అని టాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయి. ఇటీవలే శంకర్ సినిమా షూటింగ్ షెడ్యూల్ను పూర్తిచేసుకుని దర్శకధీరుడు రాజమౌళి తో కలిసి దుబాయ్ వెళ్లారు. ప్రస్తుతం అక్కడ ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ పనుల్లో పాల్గొనబోతున్నారు. ఇలా వెంట వెంటనే అగ్ర దర్శకులతో సినిమాలు చేస్తూ రామ్ చరణ్ హడావిడి చేస్తున్నారు