అలియా భట్‌ను భాగస్వామి చేశాడు.. రామ్ చరణ్ మామూలోడు కాదు!!

Ram Charan Green India Challenge To Alia Bhatt And rajamouli

రాజ్యసభ సభ్యుడు ఎంపీ సంతోష్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం మూడో దశ నడుస్తోంది. ఈ మూడో ఫేజ్‌ను ప్రభాస్ చేత ప్రారంభించాడు. ప్రభాస్ ప్రారంభించిన ఈ చాలెంజ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. పెద్ద పెద్ద హీరోలందరూ ఇందులో భాగస్వాములు అయ్యారు. ఏకంగా మషేష్ బాబు ద్వారా ఈ చాలెంజ్ కోలీవుడ్‌కు చేరింది. మహేష్ బాబు దళపతి విజయ్‌ను సవాల్ చేశాడు.

Ram Charan Green India Challenge To Alia Bhatt And rajamouli
Ram Charan Green India Challenge To Alia Bhatt And rajamouli

మహేష్ బాబు ఇచ్చిన చాలెంజ్‌ను విజయ్ పూర్తి చేశాడు. తన ఇంట్లో మొక్కలు నాటిన ఫోటోలను షేర్ చేశాడు. ప్రస్తుతం రామ్ చరణ్ వంతు వచ్చింది. రామ్ చరణ్ కూడా గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొన్నాడు. తన వంతుగా మొక్కలు నాటి ఈ అద్భుత కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాడు. దాంతో పాటు రామ్ చరణ్ ఈ సవాల్‌ స్వీకరించాలని కొందరిని నామినేట్ చేశాడు. ఆ నామినేట్ చేసిన వారిలో ఓ పేరు అందర్నీ ఆకర్షించింది.

Ram Charan Green India Challenge To Alia Bhatt And rajamouli
Ram Charan Green India Challenge To Alia Bhatt And rajamouli

రామ్ చరణ్ ఎంపీ సంతోష్‌తో కలిసి మొక్కలు నాటాడు. ఈ మేరకు తదుపరి బాధ్యతను రాజమౌళి, అలియాభట్‌కు అప్పగించాడు. అంతే కాకుండా ఆర్ఆర్ఆర్ టీం మొత్తం, నా ఫ్యాన్స్ అందరూ ఈ చాలెంజ్‌ను ముందుకు తీసుకెళ్లండని కోరాడు. అయితే ఇందులో అలియా భట్‌ను భాగస్వామిగా చేయడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. చాలెంజ్‌లు విసురుకునేంత స్నేహం ఈ ఇద్దరి మధ్య అప్పుడే ఏర్పడిందా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత పాత్రలో రామ్ చరణ్‌కు జోడిగా అలియా నటిస్తోందన్న సంగతి తెలిసిందే.

Ram Charan Green India Challenge To Alia Bhatt And rajamouli
Ram Charan Green India Challenge To Alia Bhatt And rajamouli