నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటో తేల్చడం లేదంటున్న వాళ్ళకి చరణ్ స్ట్రాంగ్ పంచ్..ఎన్ని సినిమాలు కమిటయ్యాడో చూడండి ..?

సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ అల్లు అర్జున్, సహా టాలీవుడ్ స్టార్ హీరోలంతా ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే..నెక్స్ట్ సినిమాని అనౌన్స్ చేసేస్తున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా 5 సినిమాలు చేస్తున్నట్టు ఇప్పటికే అధికారకంగా వెల్లడించాడు. కాని మెగా పవర్ స్టార్ రాం చరణ్ మాత్రం ఇంకా తన నెక్స్ట్ సినిమా ఏంటన్నది క్లారిటి ఇవ్వలేదు.

Ram Charan Next Movie Is Fixed???

ఈ విషయంలో కాస్త మెగా ఫ్యాన్స్ డిసప్పాయింట్ తో ఉన్నారట. ఎన్.టి.ఆర్. చరణ్ కలిసి ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ కంప్లీటవగానే ఎన్.టి.ఆర్ త్రివిక్రం తో ఒక సినిమా, ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేసేందుకు ఇప్పటికే ప్రణాళిక సిద్దం చేసుకున్నాడు. కాని చరణ్ ఆచార్య లో చేసే ప్రత్యేక పాత్ర మినహా మరే ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయలేదు.

అందరు ఈ దసర సందర్భంగా చరణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేస్తాడని భావించారు. కాని నిరాశే మిగిలిందని అంటున్నారు. అయితే విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రారం చరణ్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత రెండు భారీ పాన్ ఇండియన్ సినిమాలకు టాప్ డైరెక్టర్స్ ని లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది. ఆ ఇద్దరు మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాగా మరో దర్శకుడు సక్సస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ. చరణ్ ఇప్పటి వరకు ఈ ఇద్దరితో కలిసి సినిమా చేయలేదు. దాంతో ఈ ఇద్దరితో చరణ్ ప్రాజెక్ట్స్ కన్‌ఫర్మ్ అంటున్నారు. ఇక ఇప్పటికే వెంకీ కుడుముల, వంశీ పైడిపలీ చరణ్ కి కథ చెప్పి ఇంప్రెస్ చేశారని తెలుస్తుంది.