దిల్ రాజుపై మెగా ఫ్యాన్స్ సీరియస్

బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలపై ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా మొదటి పాన్ ఇండియా చిత్రంగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. తండ్రికొడుకులు పాత్రలలో చెర్రి దర్శనం ఇవ్వనున్నాడు. ఈ సినిమాకి సంబందించిన చివరి అప్డేట్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఇచ్చారు.

ఆ రోజు టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా లాంచ్ చేశారు. ఇక గేమ్ చేంజర్ టైటిల్ అందరికి భాగా కనెక్ట్ అయ్యింది. శంకర్ ఓ వైపు కమల్ హాసన్ తో ఇండియన్ 2 మూవీ చేస్తూనే గేమ్ చేంజర్ కూడా షూటింగ్ కొనసాగిస్తూ వచ్చారు. ఇక రామ్ చరణ్ గేమ్ చేంజర్ నుంచి లాంగ్ గ్యాప్ తీసుకున్నారు. ఉపాసన గర్భవతి కావడంతో డెలివరీ టైంలో ఆమెతో ఉండాలని షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు

ఇప్పుడు రామ్ చరణ్, ఉపాసన దంపతులకి కూతురు పుట్టింది. ఇదిలా ఉంటే అభిమానులు మాత్రం తమ హీరోలకి సంబందించిన సినిమాల అప్డేట్స్ రెగ్యులర్ గా వస్తూ ఉండాలని కోరుకుంటారు. ఈ అప్డేట్స్ కోసం నిర్మాతలు, దర్శకులపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ట్విట్టర్ లో నిర్మాత, దర్శకుడిని డైరెక్ట్ గా ట్యాగ్ చేసే సౌకర్యం ఉండటంతో అభిమానులు వారికి ట్యాగ్ చేసి మాకు అప్డేట్ కావాలని డిమాండ్ చేస్తారు.

ఈ పైత్యం ఈ మధ్య ఎక్కువ అయిపొయింది. తాజాగా గేమ్ చేంజర్ సినిమాకి సంబందించిన అప్డేట్స్ ఏమీ ఇవ్వడం లేదు మెగా అభిమానులు దిల్ రాజు, దర్శకుడి శంకర్ కి ట్యాగ్ చేసి పోస్టులు పెడుతున్నారు. అంతే కాకుండా హ్యాష్ ట్యాగ్స్ క్రియేట్ చేసి ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. దిల్ రాజు మీద క్రియేట్ చేసిన నెగిటివ్ హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఈ ట్యాగ్ లో మెగా అభిమానులు అందరూ గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి అప్డేట్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఇంకా 80 రోజుల షూటింగ్ పార్ట్ పెండింగ్ లో ఉందంట. ఇండియన్ షూటింగ్ ముగిసిన తర్వాత గేమ్ చేంజర్ స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది.