డైరెక్టర్ శంకర్ ‘ముక్కల’ పంచాయితీ.!

అదేంటీ, ‘భారతీయుడు’ సినిమాని రెండు ముక్కలు చేస్తున్నారా..? ‘గేమ్ ఛేంజర్’ కూడా రెండు ముక్కలు కాబోతోందా.? ఇదెక్కడి పంచాయితీ.? ఈ మధ్య చాలా సినిమాల విషయమై ఈ ముక్కల కాన్సెప్ట్‌ని దర్శక నిర్మాతలు ఎంచుకుంటున్నారు.

‘భారతీయుడు’ సంగతెలా వున్నా, ‘గేమ్ ఛేంజర్’ విషయమై రెండు ముక్కల గాసిప్స్‌ని రామ్ చరణ్ అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. రెండు పార్టులుగా సినిమా విడుదల చేయాలనే ఆలోచన వున్నప్పుడు, సంక్రాంతి రిలీజ్ డేట్ లాక్ చేసుకోవాలి కదా.? అని నిర్మాతని నిలదీస్తున్నారు సోషల్ మీడియా వేదికగా.

అయితే, నిర్మాత దిల్ రాజు ఇంతవరకు ‘గేమ్ ఛేంజర్’ రెండు పార్టుల వ్యవహారంపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఇలా వ్యూహాత్మక మౌనం కూడా, ఓ తరహా పబ్లిసిటీ స్టంట్.. అనే అనుకోవాలేమో.

రెండు పార్టుల విషయమై అభిమానుల నుంచి వచ్చే స్పందన, ప్రేక్షకుల్లో కలిగే ఆసక్తి.. వంటి అంశాల్ని పరిగణనలోకి తీసుకుని, అప్పటికప్పుడు.. నిర్ణయం తీసేసుకుంటున్నారు. ‘దేవర’ విషయంలో అదే జరిగింది.

‘గేమ్ ఛేంజర్’కి అయితే కంప్లీట్ నెగెటివ్ ఒపీనియన్ వచ్చేస్తోంది. సో, కాస్త లేటయినా, సింగిల్ పార్ట్ తప్ప, రెండు ముక్కల ఛాన్సే వుండకపోవచ్చు. కానీ, శంకర్‌తో వ్యవహారం మామూలుగా వుండదు. ఏం జరుగుతుందో చూడాలిక.