Ram charan : చరణ్ ఎంట్రీ సీన్…. గూస్ బంప్స్ పక్క అంటున్న జక్కన్న…!

Ram Charan : ఆర్ఆర్ఆర్ ఇండియా మొత్తం ఎదురుచూస్తున్న సినిమా జనవరిలోనే విడుదల కావాల్సినా కరోనా వల్ల వాయిదా పడి చివరకు మార్చి 25నా విడుదలకు సిద్ధమైంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా ఎన్టీఆర్ కొమరం భీమ్ గా ఆలియా సీత గా కనువిందుచేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ లు సినిమా మీద అంచనాలను బాగా పెంచాయి. ఇద్దరి హీరోల అభిమానులు ఉత్కంఠంగా సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

ఇది పాన్ ఇండియా సినిమా కావడంతో అన్ని చోట్ల మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో జక్కన్న చరణ్ ఎంట్రీ సీన్ మేకింగ్ అప్పుడు ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నారో తెలిపాడు. రాజమౌళి టేకింగ్ అంటే ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. ఆయన ప్రతి సన్నివేశం కూడా మనసు పెట్టి ఏకాగ్రతతో చేస్తాడు అనడంలో సందేహం లేదు. చిన్న సీన్ విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకుంటాడు .తాజాగా చరణ్ అల్లూరి సీతారామరాజుగా ఎంట్రీ ఇచ్చే సన్నివేశం గురించి మాట్లాడారు. ఈ సేన్ కోసం చాలా కష్టపడ్డారట. తాను ఈ సినిమా కోసం తీసిన భయంకరమైన షాట్స్ లో ఒకటి అంటూ తెలిపాడు. చరణ్ వెనుక వెయ్యి మంది పరిగెత్తుకుంటూ వచ్చే షాట్ అది. అతడిపై దాడి చేసేందుకు పరిగెత్తుకుంటూ వస్తారు . వారిలో కోపం చూపిస్తూ చరణ్ పరిగెత్తే సన్నివేశాన్ని చూపించాలి అనుకున్నాం. ఇది హై వోల్టేజ్ షాట్. ఊహించుకున్నప్పుడే కష్టం అనుకున్న చేసేటప్పుడు మరింత కష్టం అయ్యింది.

ఇక ఆ సన్నివేశంలో ఒకసారి దుమ్ము మరియు జనాల మధ్య చరణ్ కనిపించలేదు. దాంతో నేను భయపడ్డాను. దేవుడి దయ. అతడి మంచితనం తో క్షేమంగా బయట పడ్డాడు. అంటూ చరణ్ ఎంట్రీ సన్నివేశం గురించి తెలిపాడు. మరి తెరమీద ఈ సన్నివేశం ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుంటుందో చూడాలి.