రామ్ చరణ్ నోట.. ‘ఏజెంట్’ మాట : టీజర్ పై సర్వత్రా ఉత్కంఠ!!

అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘ఏజెంట్’. ఇది ఓ స్పై థ్రిల్లర్‌ గా తెరకెక్కింది. ఏ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ భాగస్వామిగా దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా పాలుపంచుకున్నారు. ఏప్రిల్ 28న ఈ ‘ఏజెంట్’ థియేటర్లలోకి రాబోతోన్న నేపథ్యంలో ఈ చిత్రంపై భారీ హైప్ తీసుకొచ్చే పనిలో నిమగ్నమై ఉన్నారు మేకర్స్! ఈ చిత్రానికి సంబంధించి తాజాగా విడుదల చేసిన ఓ షార్ట్ టీజర్ అక్కినేని అభిమానుల్లోనే కాదు… ప్రేక్షకుల్లోనూ సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఇందుకు కారణం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వాయిస్.

‘ఏజెంట్‌’ని ‘ధృవ’ మీట్ కాబోతున్నట్లు చెబుతూ ఓ టీజర్ విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్ లో వెనుక నుంచి రామ్ చరణ్ ని చూపిస్తూ.. చివర్లో ‘ఏజెంట్’ ఎక్కడున్నావు? అంటూ రామ్ చరణ్ పవర్ ఫుల్ వాయిస్ వినిపించారు. దీంతో ‘ఏజెంట్’ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నట్లు అంతా ఫిక్సవుతున్నారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో విడుదల చేస్తూ ధృవ Vs ఏజెంట్ అని చిత్ర యూనిట్ పేర్కొనడం ఆసక్తికరంగా ఎంతో మారింది. అయితే ఇది రామ్ చరణ్, అఖిల్ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో కట్ అనేది కొందరి మాట. ఏది ఏమైనా రామ్ చరణ్ నోట.. ఏజెంట్ ఎక్కడున్నావ్..? అనే మాట రావడం ఈ సినిమాపై మరింత హైప్ పెంచేసిందనే చెప్పుకోవాలి. ఈ చిత్రం కోసం కంప్లీట్‌గా మేకోవ‌ర్ అయ్యారు అఖిల్. స్టైలిష్ లుక్‌లో కండ‌లు తిరిగిన దేహంతో సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే వదిలిన అన్ని అప్ డేట్స్ ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. దీంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ‘ఏజెంట్’ సినిమాపై అక్కినేని అభిమానులు బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు. చూద్దాం.. ‘ఏజెంట్’గా అఖిల్ అక్కినేని ఈమేరకు మెప్పిస్తాడో..!!

Ram Charan Commands Akhil Akkineni | Druva X Agent | Surender Reddy | Agent on 28th April 2023