మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా పనులు మళ్లీ ఇటీవల వేగాన్ని అందుకున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి అని నిర్మాత దిల్ రాజు ఇటీవల శంకర్ తో సుదీర్ఘంగా చర్చలు జరిపి మరి ఈ షెడ్యూల్ను మొదలుపెట్టారు. ప్రస్తుతం శంకర్ 500 మంది తో ఒక భారీ యాక్షన్స్ సన్నివేశాన్ని షూట్ చేస్తున్నాడు.
ఇది సినిమాకు క్లైమాక్స్ అని తెలుస్తోంది. తప్పకుండా సినిమా మొత్తం కూడా ఇదే చాలా హైలైట్ గా నిలుస్తుందట. ఎక్కడ కూడా పొరపాటు లేకుండా దర్శకుడు ఈ ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాకు సంబంధించిన అనేక రకాల లీక్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.
ఇక ఇప్పుడు హీరోకు సంబంధించిన పాత్రల పేర్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు పాత్రలలో కనిపించబోతున్నాడు. ముఖ్యంగా తండ్రి పాత్రలో అప్పన్నగా, కొడుకు పాత్రలో రామ్ నందన్ గా రాంచరణ్ కనిపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే 70 శాతానికి పైగా షూటింగ్ పూర్తయింది. ఇక రెండు టైమ్ లైన్స్ లో ఈ సినిమా ఉండబోతుందట.
అప్పన్న ఒక రాజకీయ నాయకుడిగా ప్రజల సంక్షేమమే కోరుకునే ఉన్నతమైన వ్యక్తిగా కనిపించబోతున్నాడట. ఇక కొడుకు రామ్ నందన్ మాత్రం ఉన్నత చదువులు చదివి చట్టాన్ని క్రమబద్ధకరించడంలో చాలా కఠినమైన ఐపీఎస్ ఆఫీసర్ గా కనిపిస్తాడట. తప్పకుండా సినిమా అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటుంది అని చిత్ర యూనిట్ చాలా ధీమాతో కనిపిస్తోంది. ఇక దర్శకుడు శంకర్ ఈ సినిమాను 2024 సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆలోచిస్తున్నాడు.