Ramcharan: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ లభించింది అయితే ఈ కార్యక్రమం తాజాగా సీజన్ 8 కార్యక్రమాన్ని పూర్తి చేసిన విషయం తెలిసిందే ఇలా ఈ కార్యక్రమం ఆదివారం సాయంత్రం ఎంతో ఘనంగా ముగిసింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా విజేతగా సీరియల్ నటుడు నిఖిల్ విజయం సాధించారు. ఇక ఈయనకు ఒక కారుతో పాటు 55 లక్షల రూపాయల ప్రైజ్ మనీ కూడా అందించారు.
ఇలా నిఖిల్ విజేతగా నిలవగా గౌతం రన్నర్ గా నిలిచారు. ఇకపోతే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హాజరైన విషయం తెలిసిందే.ఈయన చేతుల మీదుగా బిగ్ బాస్ విజేతకు ట్రోఫీ అందజేశారు. ఇకపోతే తాతగా ఈ కార్యక్రమంలో సందడి చేసినందుకు రాంచరణ్ బిగ్ బాస్ నుంచి ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నారనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి. సాధారణంగా సెలబ్రిటీలు ఏదైనా కార్యక్రమానికి వస్తే తప్పనిసరిగా రెమ్యూనరేషన్ తీసుకుంటారు.
ఈ క్రమంలోనే రామ్ చరణ్ సైతం బిగ్ బాస్ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నందుకు ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నారు అనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి. అయితే రామ్ చరణ్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైనందుకు ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదని తెలుస్తోంది. గతంలో తన తండ్రి చిరంజీవి కూడా చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు కానీ ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదు ఇప్పుడు చరణ్ కూడా రెమ్యూనరేషన్ తీసుకోకుండా ఈ కార్యక్రమంలో సందడి చేశారని తెలుస్తుంది.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా చరణ్ నాగార్జున మధ్య గేమ్ ఛేంజర్ సినిమా గురించి చర్చలు జరగడమే కాకుండా ఈ సినిమా టీజర్ ని కూడా ప్లే చేశారు అనంతరం రామ్ చరణ్ అక్కడ ఉన్నటువంటి మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్లతో మాట్లాడి సందడి చేశారు. ఇలా ఈ కార్యక్రమంలో చరణ్ పాల్గొన్నందుకు ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోకపోవడం విశేషం.