క్లీంకారను క్లిక్‌ మనిపించిన ఫోటో!

తిరుపతి శ్రీ వేంకటేశ్వరుని సన్నిధానంలో మెగా ప్రిన్సెస్‌ క్లీంకార ఫేస్‌ రివీలైంది. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ఉపాసన దంపతులకు గత ఏడాది జూన్‌ 20న పాప జన్మించిన విషయం తెలిసిందే. పాపకు మెగా ఫ్యామిలీ క్లీంకార అనే నామకరణం చేసింది.

అయితే క్లీంకార జన్మించి 9 నెలలు గడుస్తున్నా కూడా పాప ఫేస్‌ని మాత్రం మెగా ఫ్యామిలీ ఇప్పటి వరకు రివీల్‌ కానివ్వలేదు. ఈ విషయంలో మెగా ఫ్యామిలీ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తోంది. పాప ఎక్కడ బయట కనిపించినా.. ఫేస్‌ కనిపించకుండా కవర్‌ చేస్తూ వచ్చారు. కానీ రామ్‌ చరణ్‌ బర్త్‌డే స్పెషల్‌గా క్లీంకార ఫేస్‌ రివీలైంది.

రామ్‌ చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా రామ్‌ చరణ్‌ దంపతులు, కూతురు క్లీంకారతో కలిసి వెళ్లి తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గుడిలోకి చెర్రీ దంపతులు వెళుతుండగా.. క్లీంకార ఫేస్‌ కాస్త రివీల్‌ అయ్యింది. ప్రస్తుతం క్లీంకార పిక్‌ సోషల్‌ విూడియాని షేక్‌ చేస్తోంది.