Ram Charan: సాధారణంగా మనం మన మొబైల్లో ఫోన్ నెంబర్లు కనుక సేవ్ చేసుకోవాలి అంటే ప్రతి ఒక్కరి ఫోన్ నెంబర్లను వారి పేర్లతో సేవ్ చేసుకుంటాము లేదంటే మనకు చాలా దగ్గర వారు అయితే ముద్దు ముద్దు పేర్లతో ఫోన్ నెంబర్లను సేవ్ చేసుకుంటూ ఉంటాము. ఇలా చాలామంది వివిధ రకాల పేర్లతో వారికి నచ్చిన పేర్లతో సేవ్ చేసుకుంటూ ఉంటారు. అయితే తాజాగా రాంచరణ్ కి సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది.
రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవి గారి ఫోన్ నెంబర్ ను తన మొబైల్లో ఏమని సేవ్ చేసుకున్నారనే విషయం గురించి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవ్వడంతో ప్రతి ఒక్కరూ కూడా ఏమని సేవ్ చేసుకున్నారో తెలుసుకోవాలని ఆసక్తి చూపుతున్నారు. ఇక చిన్నప్పటినుంచి కూడా చిరంజీవి అంటే రామ్ చరణ్ కు ఎంతో అమితమైన ప్రేమ గౌరవం అనే విషయం మనకు తెలిసిందే.
తండ్రి బాటలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ తండ్రిని మించిన తనయుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందారు. చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందినప్పటికీ ఒక తండ్రి చాటు బిడ్డగానే ఉంటారనే సంగతి మనకు తెలిసిందే ఎక్కడికి వెళ్ళినా తన తండ్రి చిరంజీవికి తన ఇద్దరి బాబాయిలకు ఎంతో గౌరవం మర్యాదలు ఇస్తూ ఉంటారు వారి అడుగుజాడల్లోనే చరణ్ నడుస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే మరి తన తండ్రి చిరంజీవి పేరును ఏమని సేవ్ చేసుకున్నారు అనే విషయాన్ని వస్తే… చిరంజీవి ఫోన్ నెంబర్ ను రామ్ చరణ్ తన సెల్ ఫోన్ లో నాన్నగారు అంటూ సేవ్ చేసుకున్నారని తెలుస్తోంది. చాలామంది తమ తండ్రి ఫోన్ నెంబర్ సేవ్ చేసుకోవాలి అంటే డాడ్ అంటూ సేవ్ చేసుకుంటూ ఉంటారు. కానీ చరణ్ మాత్రం తన తండ్రికి ఎంతో మర్యాద ఇస్తూ సెల్ ఫోన్ లో కూడా నాన్నగారు అంటూ సేవ్ చేసుకున్నారని విషయం తెలిసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.
