మంచు ఫ్యామిలీలో పడ్డ రకుల్ ప్రీత్ సింగ్ …ఎన్ని సినిమాలో చూడండి ..?

ప్రస్తుతం టాలీవుడ్ లో ఊహించకుండా బిజీ హీరోయిన్ గా మారిపోయింది రకుల్ ప్రీత్ సింగ్. ఆ మధ్య కాస్త గ్యాప్ వచ్చినందుకు ఇక రకుల్ పనైపోయిందని అందరూ భావించారు. కాని అలా భావించన అందరికి రకుల్ గట్టి షాకిచ్చింది. వరసగా తెలుగులో సినిమాలు కమిటవుతోంది. ఇప్పటికే క్రిష్ – మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా షూటింగ్ కూడా కంప్లీటయి పోయింది.

Here are the details about Rakul Preet's next project with Director Krish |  NewsTrack English 1

ఈ సినిమాతో మళ్ళీ సక్సస్ ట్రాక్ ఎక్కుతుందని అందరూ భావిస్తున్నారు. అయితే ఆ సినిమా రిలీజ్ కాకుండానే నితిన్ – చంద్ర శేఖర్ యేలేటి కాంబినేషన్ లో రూపొందుతున్న ” చెక్ ” అన్న సినిమాలో నటించే అవకాశం అందుకుంది. ఈ సినిమా కూడా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అంతేకాదు ఇప్పటికే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నితిన్ కూడా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకంగా ఉన్నాడు. దీంతో ఇక రకుల్ అకౌంట్ లో బ్యాక్ టు బ్యాక్ రెండు సూపర్ హిట్స్ పడబోతున్నాయని చెప్పుకుంటున్నారు.

Mohan Babu's Son Of India Title Poster Released

కాగా ఇంతలోనే మరో సినిమాలో అవకాశం వచ్చిందని తెలిస్తోంది. అది కూడా ముగ్గురు హీరోలున్న మంచు ఫ్యామిలీ తో. లాంగ్ గ్యాప్ తర్వాత రీసెంట్ గా మంచు మోహన్ బాబు ప్రధాన పాత్రలో సన్నాఫ్ ఇండియా సినిమా ప్రకటించారు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ ని కీలక పాత్ర కోసం ఎంచుకున్నట్టు లేటెస్ట్ న్యూస్. త్వరలో ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ కాబోతోందట. ఇక ఎటు మంచు విష్ణు, మనోజ్ వరసగా సినిమాలు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ కి జంటగా కూడా నటించే అవకాశాలు వస్తాయని అంటున్నారు. ఇప్పటికే మనోజ్ తో కరెంట్ తీగ సినిమా కూడా చేసింది.