టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి రకుల్ ప్రీత్ సింగ్. ఈ అమ్మడు తెలుగులో చివరిగా వైష్ణవ్ తేజ్ కి జోడీగా కొండపొలం సినిమాలో నటించింది. ఆ మూవీ తర్వాత మరల ఇప్పటి వరకు తెలుగులో మరో సినిమా ఒప్పుకోలేదు. అయితే హిందీలో మాత్రం ఈ బ్యూటీ వరుస అవకాశాలని సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది. గత ఏడాది ఐదు హిందీ సినిమాలతో ఈ అమ్మడు ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
చివరిగా చత్రివాలి అనే సినిమాతో ప్రేక్షకులని అలరించింది. ఇక ఈ ఏడాది కూడా ఆమె చేతిలో భారీగానే ప్రాజెక్ట్స్ ఉండటం విశేషం. అందులో రెండు తమిళ్ సినిమాలు కూడా ఉన్నాయి. వాటిలో ఒకటి కమల్ హసన్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఇండియన్ 2 కావడం విశేషం. మరొకటి శివకార్తికేయన్ కి జోడీగా నటిస్తుంది. దాంతో పాటు 31 అక్టోబర్ లేడీస్ నైట్ అనే సినిమా కూడా షూటింగ్ దశలో ఉంది.
ఇదిలా ఉంటే బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన తర్వాత ఈ బ్యూటీ అక్కడ నిర్మాత, నటుడుగా ఉన్న జాకీ బాగ్నానీతో ప్రేమాయణం నడుపుతున్న సంగతి అందరికి తెలిసిందే. బిటౌన్ మొత్తం ఈ విషయంపై చాలా రోజులుగా చర్చించుకుంటున్నారు. ఇక హిందీలో ఎక్కువగా జాకీ బగ్నానీ నిర్మాణంలో తెరకెక్కిన సినిమాలలోనే ఛాన్స్ లు సొంతం చేసుకుంటుంది. ఇదిలా ఉంటే ఈ మధ్య ఈవెంట్స్, పార్టీలకి ప్రియుడు జాకీతోనే ఆమె వెళ్తుంది. ఇద్దరు కొంతకాలంగా రిలేషన్ లో ఉన్నారనే మాట వినిపిస్తుంది.
ఇక ఈ ఏడాదిలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కుతారనే చర్చ నడుస్తుంది. తాజాగా నెట్ ఫ్లిక్స్ ఈవెంట్ లో రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడు జాకీ బగ్నానితో తో మీడియా ముందుకి వచ్చి ఫోజులు ఇచ్చింది. ఇప్పుడు దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఈవెంట్ లో వారిద్దరే ఎట్రాక్షన్ గా ఉండటం విశేషం. మరి రకుల్ ప్రీత్ సింగ్ తన పెళ్లి కబురు ఎప్పుడు చెబుతుంది అనేదానిపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.