రకుల్ నిర్మాణం.! టాలీవుడ్‌లో బిగ్ హీరోకి గాలమేస్తోందిట.!

ఇప్పుడంతా ఓటీటీ కంటెంట్ ట్రెండ్ నడుస్తోంది.! పెద్ద పెద్ద హీరోలు, హీరోయిన్లు.. ఓటీటీ కంటెంట్ మీద తెగ ఆసక్తి చూపుతున్నారు. డబ్బులెక్కువొస్తాయ్.. షూటింగ్ డేస్ తక్కువగా వుంటాయ్. పైగా, జనానికి చేరువయ్యేందుకు సులభమైన మార్గం.

సినిమాలతో పోల్చితే రిస్క్ తక్కువ. ఇదంతా ఇప్పుడెందుకంటే, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నిర్మాణ రంగంలోకి.. అందునా ఓటీటీ కంటెంట్ నిర్మాణంలోకి అడుగు పెట్టబోతోందిట.

ఓ టాలీవుడ్ బిగ్ హీరోతో కలిసి ఓ వెబ్ సిరీస్ చేయబోతోందట రకుల్ ప్రీత్ సింగ్. తాను నిర్మాతగా ఈ వెబ్ సిరీస్‌ని రకుల్ రూపొందించబోతోందిట. ఇంతకీ ఎవరా బిగ్ హీరో.? ఆ హీరోతో రకుల్ ఓ సినిమా కూడా చేసింది. అతనితో ఆమెకు బాగా క్లోజ్‌నెస్ వుందని అప్పట్లో ప్రచారం జరిగింది.

అన్నట్టు, విక్టరీ వెంకటేష్ – రానా కలిసి ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ట్రెండ్ నిజంగానే మారింది. రకుల్ ఓ వైపు సినిమాలు.. ఇంకో వైపు వెబ్ సిరీస్.. పైగా, నిర్మాణం.. అదిరిందమ్మా రకుల్.!