వైరల్ : రజినీకాంత్ “జైలర్” ఫస్ట్ రివ్యూ.!

ఇండియన్ సినిమా దగ్గర చాలా మంది స్టార్ లు ఉండొచ్చు కానీ ది బిగ్గెస్ట్ పాన్ ఇండియా సూపర్ స్టార్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా సూపర్ స్టార్ రజినీకాంత్ అనే చెప్పాలి. మరి రజిని తన రేంజ్ హిట్ కొడితే బాక్సాఫీస్ తో పాటుగా అందరికీ బాగా తెలుసు.

కానీ ఇప్పుడు తాను ఫామ్ లో లేరు. ఎంతో పెద్ద హిట్ అవుతుంది అనుకున్న “కబాలి” చిత్రం భారీ డిజాస్టర్ అయ్యింది. దీనితో అక్కడ నుంచి తగ్గుతూ వచ్చిన రజిని మార్కెట్ మొన్న “పెద్దన్న” సినిమాతో మరింత తగ్గింది. కానీ ఇపుడు చేసిన లేటెస్ట్ సినిమా “జైలర్” తో రజినీకాంత్ మళ్ళీ తన ట్రాక్ లోకి వచ్చినట్టుగా ట్రైలర్ చూసాక అనిపించింది.

దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం కోసం అటు తమిళ సహా మన తెలుగు ఆడియెన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ చిత్రం వరల్డ్డ్ ఫస్ట్ రివ్యూ అంటూ ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ చిత్రానికి సంగీతం అందించగా సంగీత దర్శకుడు అనిరుద్ లేటెస్ట్ గా పెట్టిన పోస్ట్ అయితే ఇప్పుడు కోలీవుడ్ వర్గాల్లో వైరల్ గా మారుతుంది.

అనిరుద్ జైలర్ సినిమా కంప్లీట్ గా చూశాడని చూసిన తర్వాత పోస్ట్ చేసిన పోస్ట్ ఫస్ట్ రివ్యూ అంటూ తమిళ సినీ ట్రాకర్స్ అంటున్నారు. అనిరుద్ జైలర్ అంటూ బ్లాస్టింగ్ ఎమోజిస్ సహా విన్ అయ్యాం అన్నట్టుగా కొన్ని ట్రోఫీ ఎమోజిస్ తో పోస్ట్ చేసాడు. దీనితో జైలర్ హిట్ అయిపోయినట్టే అని ఇదే జైలర్ ఫస్ట్ ఎవర్ రివ్యూ అలాగే ఇది వరకు అనిరుద్ ఏ చిత్రానికి కూడా ఇలా పోస్ట్ చేయలేదు అంటూ ఎందుకో పర్టిక్యులర్ గా వైరల్ చేస్తున్నారు.