తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ అలాగే కన్నడ స్టార్ నటుడు శివ రాజ్ కుమార్ లతో దర్శకుడు నెల్సన్ తెరకెక్కించిన భారీ చిత్రం “జైలర్” కోసం అందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తో అంతా సూపర్ హ్యాపీగా ఉండగా ఈ చిత్రం సమయంలోనే కొన్ని పొలిటికల్ అంశాలు కూడా వైరల్ గా మారాయి.
ఇక ఇదిలా ఉండగా రజినీకాంత్ అయితే ప్రముఖ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితులు అని అందరికీ తెలిసిందే. కాగా ఆ మధ్య బాబు పై పొగడ్తలు కూడా పెద్ద ఎత్తున చేశారు. కానీ అనూహ్యంగా చంద్రబాబు పై కేసు పెట్టి జైల్లో పెట్టడంపై అయితే లోకేష్ కి కాల్ చేసి తన సంఘీభావం వ్యక్తం చేశారు.
అంతే కాకుండా చంద్రబాబు ని అయితే తాను కలవడానికి కూడా వస్తున్నారు అని రీసెంట్ గా కొన్ని రూమర్స్ వచ్చాయి. కానీ అదిగో వస్తున్నారు ఇదిగో వస్తున్నారు అని డబ్బా మాటలు తప్ప తలైవా అయితే బాబుని కలిసింది లేదు. మరి ఇదిలా ఉండగా రజినీకాంత్ అయితే బాబుని ఎందుకు కలవలేదు అనే దానిపై స్పందించారు.
తాను అయితే నిజానికి చంద్రబాబుని జైల్లో నిజంగానే కలవాల్సి ఉంది అని కానీ తనకి ఫ్యామిలీలో కొన్ని అకేషన్స్ మూలాన అవి అటెండ్ కావాల్సి వచ్చింది అందుకే కలవడం వీలు పడలేదు అని తలైవా క్లారిటీ ఇచ్చారు. మరి బహుశా ఈ వారంలో కలవొచ్చు ఏమో చూడాలి.