టీజర్ టాక్ : రజినీ స్వాగ్ తో అదిరేలా “లాల్ సలాం” ఇంట్రో..!

ఈరోజు దీపావళి బ్లాస్ట్ అయితే సౌత్ ఇండియా సినిమా దగ్గర ఓ రేంజ్ లో స్టార్ట్ అవుతుండగా ఈ పండుగ కానుకగా అయితే ఆల్రెడీ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న సరికొత్త చిత్రం “లాల్ సలాం” నుంచి కూడా ఓ బిగ్ ట్రీట్ ఉన్నట్టుగా మేకర్స్  ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు.

మరి ఇవాళ దీపావళి కానుకగా సినిమా టీజర్ ని రిలీజ్ చేస్తున్నట్టు తెలపగా ఇప్పుడు దానిని రిలీజ్ చేశారు. అయితే ఈ టీజర్ అంచనాలు అందుకునేలా ఉందనే చెప్పాలి. కాగా ఈ చిత్రాన్ని రజిని కూతురు ఐశ్వర్య రజినీకాంత్ తెరకెక్కించగా విష్ణు విశాల్ మరియు విక్రాంత్ సంతోష్ లు హీరోలుగా నటించారు.

అయితే ఈ ఇద్దరి మధ్య నడిచే ఒక గ్యాంగ్ వార్ ఎక్కడ వరకు తీసుకెళ్లింది దానిని ఓ ముస్లిం పెద్ద అయినటువంటి రజిని కాంత్ వరకు వెళితే తానేం చేసాడు అన్న లైన్ తో అయితే కనిపిస్తుంది. ఇంట్రెస్టింగ్ ఈ సినిమాలో రజిని లుక్ బాగుంది దీనికన్నా ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే తనపై ఏక్షన్ సీన్స్ కూడా ఉండడం అని చెప్పాలి.

దీనితో మళ్ళీ రజినీ స్వాగ్ సూపర్ గా కనిపిస్తుండగా ఈ టీజర్ కి సూపర్ ప్లస్ అయ్యాయని చెప్పాలి. అలాగే ఇందులో ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మొత్తానికి అయితే ఈసారి మాత్రం ఏదో వర్కౌట్ అయ్యేలానే ఉందని చెప్పాలి. కాగా ఈ చిత్రం తెలుగు తమిళ్ హిందీలో వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుంది. 
Lal Salaam Teaser (Hindi) | Rajinikanth | Aishwarya | Vishnu Vishal | Vikranth | ARRahman