Rajendra Prasad: బన్నీ లవ్ యూ రా…నువ్వు నా బంగారం: రాజేంద్రప్రసాద్

Rajendra Prasad: సినీ నటుడు రాజేంద్రప్రసాద్ పట్ల ఇటీవల అల్లు అర్జున్ అభిమానులు భారీ స్థాయిలో ట్రోల్స్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఈయన హరి కథ అనే వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడుతూ హీరోల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాడెవడో మొన్న వచ్చాడు ఎర్రచందనం దొంగతనం చేసేవాడు కూడా హీరోనే అంటూ ఈయన మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్ ఎక్కడా కూడా అల్లు అర్జున్ పేరు కానీ పుష్ప 2, సినిమా పేరును గాని ప్రస్తావించలేదు కానీ ఈయన మాత్రం పరోక్షంగా అల్లు అర్జున్ ని ఉద్దేశించే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అంటూ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడటమే కాకుండా ఈయనపై భారీ స్థాయిలో విమర్శలు చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన సినిమా పుష్ప 2 కావడంతోనే ఈయన కచ్చితంగా ఈ సినిమా గురించే మాట్లాడారు అంటూ బన్నీ ఫాన్స్ ఫైర్ అయ్యారు.

ఇకపోతే ఈ విషయంపై రాజేంద్రప్రసాద్ విమర్శలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయన ఈ వివాదం గురించి స్పందించారు. నేను నా సినీ కెరియర్ లో ఇప్పటి వరకు ఇలాంటి వివాదాలలో చిక్కుకోలేదు కానీ మొదటిసారి ఈ వివాదంలో నిలవడంతో తాను ఈ వార్తలు విని నవ్వుకొని బాగా ఎంజాయ్ చేశానని తెలిపారు.. ఈ వార్తలు రాసింది ఎవడో కానీ వానికి నేను ఒకటే చెబుతున్నాను అల్లు అర్జున్ నాకు కొడుకుతో సమానం. నేను అల్లు అర్జున్ ని ఉద్దేశించి అలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

కొడుకు సమానమైనటువంటి అల్లు అర్జున్ గురించి నేనెందుకు అలా మాట్లాడతాను బన్నీ నువ్వు బంగారం లవ్ యు సో మచ్ అంటూ ఈయన ఈ వివాదం పై స్పందిస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. దీంతో రాజేంద్రప్రసాద్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.