సుమకు అలాంటివి రావు.. పురువుతీసిన రాజీవ్ కనకాల

Rajeev Kanakala Counters On Suma In Big Celebrity Challenge

సుమ రాజీవ్ కనకాల రియల్ లైఫ్‌లో ఎంత ఫన్నీగా ఉంటారో అందరికీ తెలియకపోవచ్చు. కానీ తెరపై కనిపిస్తే మాత్రం ఒకరిపై ఒకరు పంచ్‌లు బాగానే వేసుకుంటుంటారు. మరీ ముఖ్యంగా సుమను ఎక్కువగా రాజీవ్ కనకాల ఆట పట్టిస్తుంటాడు. సుమ కొన్ని సార్లు కౌంటర్లు వేస్తుంటుంది.. ఇంకొన్ని సార్లు రాజీవ్‌ను ఫాలో అవుతుంటుంది. అలా సుమ, రాజీవ్‌లు బుల్లితెర షోల్లో చేసే సందడి వేరే లెవెల్‌లో ఉంటుంది. మామూలుగా సుమ నిర్వహించే షోల్లో రాజీవ్ అప్పుడప్పుడు మెరుస్తూ ఉంటాడు.

Rajeev Kanakala Counters On Suma In Big Celebrity Challenge
Rajeev Kanakala Counters On Suma In Big Celebrity Challenge

సుమ హోస్ట్ చేసే షోల్లో రాజీవ్ స్పెషల్ అప్పీయరెన్స్ ఇస్తుంటాడు. స్టార్ మహిళా, క్యాష్ వంటి షోల్లో రాజీవ్ ఇది వరకు కనిపించాడు. ఇద్దరూ కలిసి రచ్చ చేశారు. ఎన్నో సార్లు ఎమోషన‌ల్‌కు గురయ్యారు. షోల్లోనూ తమ మీద ఒకరిపై ఇంకొకరికి ఉన్న ప్రేమను చాటి చెప్పుకున్నారు. ఇంట్లో ఇద్దరి మధ్య జరిగే సరదా విషయాలను కూడా బయటకు చెప్పేవారు. అయితే తాజాగా సుమ హోస్ట్‌గా వస్తోన్న బిగ్ సెలెబ్రిటీ చాలెంజ్ షోలో రాజీవ్ గెస్ట్‌గా వచ్చాడు.

ప్రతీవారం సెలెబ్రిటీలను పట్టుకొచ్చి ఎంటర్టైన్ చేస్తోన్న సుమ ఈ సారి రాజీవ్‌ను తీసుకొచ్చింది. ఇందులో రాజీవ్ కౌంటర్లు వేస్తూ సుమ పరువుదీశాడు. సుమ చేసే మిరపకాయల పచ్చడి అంటే నాకిష్టం అని రాజీవ్ అంటాడు. బాగా చేస్తుందా?అని రాజీవ్‌ను రవి ప్రశ్నిస్తాడు. అంటే పచ్చిమిరపకాయలనే నూరి తీసుకొచ్చి నోట్లోపెడుతుందని రాజీవ్ కౌంటర్ వేశాడు. మా కేరళలో పచ్చళ్లు లేవని సుమ అంటే.. కేరళలో పచ్చళ్లు ఉన్నావ్.. ఈవిడకు రావు అంటూ సుమ గాలి తీసేశాడు రాజీవ్ కనకాల.