Rajashekhar : రాజశేఖర్ కూతురితో కలిసి నటించిన ‘ శేఖర్ ‘సినిమా విడుదల తేదీ ఖరారు..!

Rajashekhar : యాంగ్రీ యంగ్ మెన్ గా తెలుగు సినిమాల్లో గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాజశేఖర్. తెలుగు సినిమాలలో ఈయన హీరోగా మంచి విజయాలు సొంతం చేసుకున్నారు. కానీ చాలాకాలంగా వెండితెరకు దూరంగా ఉన్నారు. కల్కి సినిమా తరువాత వెండి తెర మీద కనిపించలేదు.అయితే ప్రస్తుతం రాజశేఖర్ కథానాయకుడిగా శేఖర్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రాజశేఖర్ పెద్ద కుమార్తె అయిన శివాని రాజశేఖర్ కీలక పాత్ర పోషించడం విశేషం.

ఈ సినిమాలో కూడా శివాని రాజశేఖర్, రాజశేఖర్ కు కూతురి పాత్రనే పోషించింది.రాజశేఖర్ సతీమణి జీవిత ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయడం విశేషం. వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివానీ రాజశేఖర్, శివాత్మికా రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రాజశేఖర్ కు ఈ సినిమా 91 వ చిత్రం కావడం విశేషం.ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన జీవిత రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతూ…ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు, ఫస్ట్ గ్లింప్స్, లవ్ గంట మోగిందంటే పాటకు అద్భుత స్పందన లభించింది అని,సినిమా కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది అని చెప్పారు. అంతే కాకుండా రాజశేఖర్, శివానిల మధ్య సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. నిజ జీవితంలో ఎలా ఉంటారో… సినిమాలో కూడా అలాగే ఉన్నారు. వారిద్దరూ చాలా సహజంగా చేశారు. అని చెప్పుకొచ్చారు.మే 20 న ఈ చిత్రన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలియజేసారు.