Rajamouli : మహేష్ తో భారీ యాక్షన్ సినిమా….. చెప్పేసి ఆసక్తి పెంచిన జక్కన్న..!

Rajamouli : అపజయం ఎరుగని దర్శకుడిగా పేరున్న జక్కన్న ఆర్ఆర్ఆర్ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. తన కుటుంబం తో కలిసి రెండు వారాలు విహార యాత్రకు వెళ్ళివచ్చాక మహేష్ తో సినిమా గురించిన చర్చలు జరుగుతాయాంటూ చెప్పాడు.తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ముందు సినిమా ప్రభావం ఉండదని అందుకే విరామం తీసుకుని మళ్ళీ ఫ్రెష్ గా మొదలుపెడతానని చెప్పారు.

ఇక ఆర్ఆర్ఆర్ గురించిన మీడియా సమావేశాల్లో పాల్గొంటున్న రాజమౌళి తన తదుపరి సినిమా మహేష్ తో తీయబోయే సినిమాగురించి కూడా వివరాలను చెప్తున్నారు. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెంచుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తో తాను చేయబోతున్న సినిమా భారీ యాక్షన్ సాహస వీరుడి మూవీ అంటూ ప్రకటించాడు. ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకునే భారీ ఎంటర్ టైనర్ గా ఆ సినిమా ఉండబోతుంది అన్నట్లుగా జక్కన్న రాజమౌళి ప్రకటించాడు.

ఎలాంటి అనుమానం లేకుండా ఒక భారీ యాక్షన్ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేయబోతున్నట్లు రాజమౌళి ప్రకటించాడు. ఇక రాజమౌళి ప్రకటనతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తో రాజమౌళి సినిమా ఖచ్చితంగా ఓ రేంజ్ లో ఉంటుందని ప్రతి ఒక్కరు నమ్మకంతో ఉన్నారు. ఇక రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా లో ఎలా అయితే ఎమోషన్స్ ను చూపించి కన్నీరు పెట్టించాడో అలాగే మహేష్ బాబుతో చేయబోతున్న సినిమాలో కూడా ఎమోషన్స్ ను బాగా చూపిస్తాను అని రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు హామీ ఇచ్చాడు. ఈ సినిమా కోసం చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్న మహేష్ బాబు అభిమానులకు ఈ వార్త నిజంగానే సూపర్ కిక్ ఇచ్చే వార్త.