పాపం రాజమౌళి , ఇలా అవుతుంది అని అస్సలు అనుకుని ఉండడు పాపం.

టాలీవుడ్ లో ఇప్పటి వరకు రాజమౌళి ని మించిన దర్శకుడు లేదనే అందరూ భావించారు. ఇప్పటికీ అదే నమ్మకంతో ఉన్నారు. ఒక్క తెలుగు ఇండస్ట్రీలోనే కాదు మిగతా భాషల్లో కూడా బాహుబలి తర్వాత రాజమౌళి గురించే చెప్పుకునే వారు. కాని ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది. కేజీఎఫ్ ఛాప్టర్ 1 తో రాజమౌళి కి ఉన్న సత్తా దర్శకుడు ప్రశాంత్ నీల్ కి ఉందని చెపుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా రిలీజైన కేజీఎఫ్ ఛాపటర్ 2 తో ప్రశాంత్ నీల్ రాజమౌళి ని మించిపోయాడన్న టాక్ మొదలైంది.

I was blown away by visuals of KGF: SS Rajamouli- Cinema express

కేజీఎఫ్ ఛాప్టర్ 2 అంత సంచనలం సృష్ఠించి కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. దాంతో ఇప్పుడు రాజమౌళి మీద బాగా ఒత్తిడి పెరిగిపోయింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మార్చి లేదా ఏప్రిల్ వరకు ఈ సినిమా షూటింగ్ ని కంప్లీట్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ కొమురం భీమ్.. రామ్ చరణ్ అల్లూరి ల పాత్రలకు సంబంధించిన టీజర్ లను విడుదల చేశారు. ఆ రెండు టీజర్ లు సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి. ఇక సినిమా నుండి మరో టీజర్ ను అభిమానులు ఆశిస్తున్నారు.

RRR: Story, budget, full cast and all you need to know about SS Rajamouli  film - Movies News

అయితే ఇప్పుడు ఎన్టీఆర్ కొమురం భీమ్.. రామ్ చరణ్ అల్లూరి ల పాత్రలకు సంబంధించిన ఒకే టీజర్ కోసం అటు నందమూరి అభిమానులు ఇటు మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కాగా ఇటీవల కేజీఎఫ్ 2 టీజర్ రావడంతో ఈ ఇద్దరి స్టార్ హీరోల అభిమానులు ఆర్ఆర్ఆర్ టీజర్ అంతకు మించి ఉండాలని రాజమౌళిని ఒత్తిడి చేస్తున్నట్టు ఫిల్మ్ నగర్ లో చేప్పుకుంటున్నారు. బాహుబలి రెండు భాగాలకి అలాగే ఆర్ఆర్ఆర్ నుంచి వచ్చిన ఎన్టీఆర్ కొమురం భీమ్.. రామ్ చరణ్ అల్లూరి ల పాత్రలకు సంబంధించిన టీజర్స్ గురించి రాజమౌళి ని ఎంతగా ప్రశంసించారో అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు ఆర్ఆర్ఆర్ నుంచి వచ్చే టీజర్ కేజీఎఫ్ 2 టీజర్ ను మించి ఉంటుందా లేదా అన్నది ఇప్పుడు అందరిలోనూ సాగుతున్న హాట్ టాపిక్. ఏదేమైనా కేజీఎఫ్ 2 టీజర్ రాజమౌళి మీద బాగానే ఒత్తిడి పెంచేసింది.