వైరల్ : #SSMB29 పై అదిరే అప్డేట్ ఇచ్చిన రాజమౌళి.!

టాలీవుడ్ ఆల్ టైం హ్యాండ్సమ్ హంక్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ఓ భారీ ఏక్షన్ డ్రామాకి చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం మహేష్ కెరీర్ లో 28వ సినిమా తెరకెక్కిస్తుండగా నెక్స్ట్ అయితే ఇక ఇండియా సినిమా టాప్ దర్శకుడు రాజమౌళితో చేయనున్న సినిమాపై అయితే ఇక ఏకంగా గ్లోబల్ వైడ్ అంచనాలు నెలకొన్నాయి.

మరి ఈ భారీ సినిమా పై ఎప్పుడు ఏ చిన్న హింట్ వచ్చినా టాలీవుడ్ లో పెద్ద సెన్సేషన్ గా ఇది మారుతూ ఉండగా నెక్స్ట్ అయితే ఈ భారీ సినిమా జక్కన మరో అదిరే అప్డేట్ ఇవ్వడం టాలీవుడ్ వర్గాలను షేక్ చేస్తుంది. కొన్ని నెలల కితమే మహేష్ సినిమా స్క్రిప్ట్ ని స్టార్ట్ చేశామని తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ నే ఈ కథని రెడీ చేస్తుండగా తనతో పాటుగా ఓ బృందం కూడా కథని తీర్చి దిద్దే పనిలో ఉన్నారని రాజమౌళి తెలిపాడు.

అంతే కాకుండా తాను ఎప్పుడు నుంచో చేయాలి అనుకుంటున్నా అడ్వెంచర్ జానర్ సినిమా కూడా ఈ సినిమాతో చేయబోతున్నామని తెలిపాడు. అలాగే తనకి ఇండియానా జోన్స్ సినిమా అంటే చాలా ఇష్టం అని మళ్ళీ ఒకసారి గుర్తు చేసాడు దీనితో ఈ చిత్రం తరహాలోనే మహేష్ తో సినిమా కూడా ఉంటుంది అని మళ్ళీ కన్ఫర్మ్ చేసినట్టే అని ఊహించవచ్చు.